Kangana Ranaut tweets.. Jai Maharashtra, Jai Shivaji: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వ్యవహారంపై మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. తరచూ కాంట్రవర్సీ వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కంగనా తీరుపై దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే.. తాజాగా ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చడంపై శివసేన పార్టీ కంగనాపై ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఈ క్రమంలోనే ముంబైలో ఎలా అడుగుపెడతావో చూస్తామంటూ నాయకులు, శివసైనికులు కంగనాకు హెచ్చరికలు సైతం పంపారు. దీనిపై వెంటనే కంగనా స్పందిస్తూ.. ఈ నెల 9న ముంబైకి వస్తానని.. వీలైతే ఆపండంటూ సవాల్ విసిరింది. అయితే ఆమె చెప్పినట్లుగానే బుధవారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లా భాన్ల నుంచి ముంబైకి బయలుదేరింది. ఈ క్రమంలో హమిర్‌పూర్ జిల్లా కొతి ప్రాంతంలోని ఓ ఆలయంలో పూజలు చేసి చండీగఢ్‌కు బయలుదేరింది. అక్కడి నుంచి నేరుగా విమానంలో ముంబైకి వెళ్లనుంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అంతకు ముందు కంగనా చేసిన ట్విట్ చర్చనీయాంశంగా మారింది. కంగనా ఈ విధంగా ట్విట్‌లో రాసింది... ‘‘రాణి లక్ష్మీబాయి ధైర్యం, శౌర్యం త్యాగాలను నేను చిత్రం ద్వారా చూపించాను.. విచారకరమైన విషయం ఏమిటంటే, నా సొంత రాష్ట్రం మహారాష్ట్రకు రాకుండా నన్ను అడ్డుకుంటున్నారు. అయినా నేను లక్ష్మీబాయి వలే తలవంచను భయపడను.. నేను తప్పుకు వ్యతిరేకంగా గళమెత్తుతూనే ఉంటాను.. జై మహారాష్ట్ర, జై శివాజీ’’ అంటూ ట్విట్ చేసింది. Also read: Nithiin: ప్రభాస్ బాటలో నితిన్.. దర్శకుడికి నితిన్ ఖరీదైన గిఫ్ట్


ఇదిలాఉంటే.. కంగనా రనౌత్‌కు కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం వై ప్లస్ కేటగిరీ భద్రత సైతం కల్పించింది. అయితే.. కంగనా రాక నేపథ్యంలో ముంబైలో అణువణువునా భద్రతను పెంచారు. ఎయిర్‌పోర్టులో భారీగా పోలీసులు మోహరించారు. ఇదిలాఉంటే.. కంగానా చేసిన డ్రగ్స్ వ్యాఖ్యలపై విచారణ చేపడతామంటూ శివసేన ప్రకటించింది. ఈ క్రమంలో కంగనా రనౌత్ వేరే రాష్ట్రం నుంచి వస్తున్న నేపథ్యంలో ఆమె కరోనా పరీక్షలు చేసి క్వారంటైన్ చేస్తారని పలువురు పేర్కొంటున్నారు. Rhea Chakraborty Arrest: అది ఆమె కర్మ.. అంకితా లోఖాండే పోస్ట్!