ముచ్చటగా మూడోస్సారీ.. గడ్డి కేసులో లాలూయే దోషి !
గడ్డి కుంభకోణం కేసులో ముచ్చటగా మూడోసారి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు.
గడ్డి కుంభకోణం కేసులో ముచ్చటగా మూడోసారి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. చైబాసా ట్రెజరీ అవకతవకల కేసులో లాలూతో పాటు బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాను కూడా బుధవారం రాంచి సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. అయితే వీరికి గురువారం శిక్ష ఖరారు చేయనున్నారు.
ఇప్పటికే లాలూ దాణా(గడ్డి)కుంభకోణానికి సంబంధించిన రెండు కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.! 1990-93 చైబాసా ట్రెజరీ కేసులో 33.7 కోట్ల అవకతవకలు జరిగాయి. లాలూ దోషిగా తేలడంతో బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ స్పందించారు. సీఎం నితీష్ కుమార్ ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని ఉద్దేశపూర్వకంగానే గడ్డి కుంభకోణంలో ఇరికించారని ఆరోపించారు.