హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా  52 ఏళ్ల జైరాం ఠాకూర్ ఎన్నికయ్యారు. ఆయనే హిమాచల్ లో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపించనున్నారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశ రాజకీయ నాయకుల వలెనే ఠాకూర్ 1965లో మండి జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేదవాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చురుకుగా ఉన్న చిన్న కొడుకు జై రామ్ ను చదివించాలని అతని తండ్రి మరియు సోదరులు పనికెళ్ళేవారు.


థాకూర్ వారిని నిరాశపర్చలేదు. బాగా చదువుకున్నాడు. చండీఘడ్ లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎంఏలో చక్కటి ప్రతిభ కనబరిచాడు. అతని కుటుంబం ఉద్యోగం లేదా వ్యవసాయంలో సహాయపడతారని  అనుకున్నారు. కానీ ఠాకూర్ కు మనసులో ఏదో తలుచుకొని ఆలోచనలో ఉండేవాడు. కుటుంబం వద్దన్నా ఠాకూర్ 1993 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరుఫున టికెట్ సంపాదించి సెరాజ్ నుంచి పోటీ చేశారు. అప్పుడు అతని వయసు  28 ఏళ్లు. మంచి పోటీ ఇచ్చినప్పటికీ తరువాత, అతను ఓడిపోయాడు.


ప్రతి ఒక్కరూ తన రాజకీయ జీవితం ముగిసిందని భావించారు. కానీ ఠాకూర్ రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తరువాతి ఎన్నికల వరకు వేచి చూసి, 1998 లో మరోసారి బిజెపి టికెట్ పొంది గెలుపొందాడు. ఠాకూర్ ఈ నియోజకవర్గం నాలుగుసార్లు విజయం సాధించాడు.అయితే 2013లో వీరభద్ర సింగ్ భార్య ప్రతిథా సింగ్ తో పోటీపడి లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయాడు. 2008 లో, ఠాకూర్ ధుమల్ ప్రభుత్వం లో గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ మంత్రిగా పనిచేశారు. 2007-09 మధ్యకాలంలో హిమాచల్ ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.


ఈయన భార్య పేరు సాధనా ఠాకూర్. ఈయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సాధన డాక్టర్. కన్నడ కుటుంబంలో జన్మించిన సాధన  జైపూర్ లో పుట్టి పెరిగారు. ఈమె ఏబీవీపీ లో కార్యకర్తగా ఉండేవారు. ఠాకూర్ తో పాటు కేంద్ర మంత్రి జెపి నడ్డా కూడా ఈ పదవికి రేసులో ఉన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం జై రామ్ ఠాకూర్ వైపే మొగ్గుచూపింది.