పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్లీ పుల్వామా తరహా దాడులకు కుట్ర చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.  భారత ఇంటెలిజెన్స్ అధికారులు ఇదే హెచ్చరిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019 ఫిబ్రవరి 14.. భారత చరిత్రలో ఓ చీకటి రోజు. అదే రోజున జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా దాడి చేయడంతో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.  ఆ దాడి ఘటనకు భారత్ బదులు తీర్చుకుంది. ఐతే పాకిస్తాన్ ఉగ్రవాదులు .. మళ్లీ పేట్రేగిపోతున్నారు. భారత్ పై దాడి చేసేందుకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.  


భారత్ పై మళ్లీ పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈసారి మరో పెద్ద కుట్రకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ..ISI వ్యూహం రచిస్తున్నట్లు తెలిపింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ- మహ్మద్ .. మిగతా ఉగ్రవాద సంస్థలతో కలిసి 'ఘజ్నవి' ఫోర్స్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 27 మంది ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆక్రమ కశ్మీర్ లో శిక్షణ ఇస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 'ఘజ్నవి' ఫోర్స్ లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు జైష్ -ఎ- మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్-ఎ-తోయిబా ఉన్నట్లు తెలుస్తోంది. POKలో శిక్షణ తీసుకుంటున్న ఈ ఉగ్రవాదులు.. భారత ఆర్మీ జవాన్లపై కాన్వాయ్ తో దాడి చేసేందుకు కుట్రలు చేస్తున్నారు.  


ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో జమ్ము కాశ్మీర్ పోలీసులు, భారత జవాన్లు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో నిత్యం పహారా కాస్తున్నారు.