జమ్ము కశ్మీర్‌కు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్దల సభలో ఆర్టికల్‌ 370ను రద్దు , 35(ఏ) రద్దు చేస్తూ సంచలన బిల్లును ప్రేవేశపెట్టిన మోడీ సర్కార్ ...ఆ వెంటనే జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విడదీసే బిల్లును ప్రవేశపెట్టింది. కాగా ఈ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. తాజా నిర్ణయంతో జమ్మూ కశ్మీర్ రాష్ట్రం కాస్త రెండు భాగాలుగా ( జమ్మూ కశ్మీర్, లద్దాక్‌ )  ఏర్పడి... కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుంది.


రాష్ట్ర విభజన బిల్లుపై అమిత్ షా మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయనున్నట్లు తెలిపారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని  లద్దాక్‌, జమ్ము కశ్మీర్ లు గా విభజించనున్నట్టు పేరొన్నారు.  వీటిల్లో జమ్ము, కశ్మీర్‌లు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం గాను.. టిబెట్‌, చైనా, గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ సరిహద్దులుగా కలిగిన లద్దాక్‌  ప్రాంతాన్ని అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. కాగా అమిత్ షా ప్రతిపాదనను విభేదించిన ప్రతిపక్షాలు సభలో నిరసన వ్యక్తం చేశాయి. దీంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.