Omar Abdullah: ది కశ్మీర్ ఫైల్స్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యధికంగా చర్చించుకుంటున్న విషయాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాకు ప్రశంసలతో పాటు.. నాణెనికి రెండో వైపు అన్నట్లు వ్యతిరేకత కూడా తీవ్రంగానే ఉంది. చాలా మంది ప్రముఖులు సైతం ఈ మూవీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ సినిమాలో చూపించిన విషయాలను తప్పుబట్టారు.. జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్​ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా. మూవీలో చాలా విషయాలను తప్పుగా చూయించారని ఆరోపించారు.


ముఖ్యంగా 1990లో కశ్మీర్​లో పండిట్​లపై దాడులు జరిగిన సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లు చూపించారని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. అయితే నిజానికి ఆ సమయంలో జమ్ము కశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలో ఉందని చెప్పారు.


పండిట్లు కశ్మీర్​కు తిరిగివచ్చేందుకు కృషి చేస్తాం..


ఇక దాడుల్లో కశ్మీర్​ పండిట్లు మరణించడం విచారకరమని చెప్పిన ఒమర్ అబ్దుల్లా.. అల్లర్ల కారణంగా ఎంతో మంది మస్లింలు, సిక్కులు కూడా ప్రాణాలు కోల్పోయారన్నారు. వలస వెళ్లిన ముస్లింలు చాలా మంది తిరిగి రాలేదన్నారు. కశ్మీర్​ పండిట్లు తిరిగి వచ్చేందుకు తాము కృషి చేస్తామని కూడా వివరించారు. ఇందుకోసం పోరాటం చేసేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు.


దక్షిణ కశ్మీర్​లోని కుల్గామ్​ జిల్లాలో ర్యాలీ నిర్వహించిన ఒమర్ అబ్దుల్లా.. కశ్మీర్​ ఫైల్స్ మూవీ అంశాన్ని ప్రస్తావించారు. ఇదివరకే జమ్ము కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రులు మోహబూబా ముఫ్తి, ఫరుఖ్ అబ్దుల్లాలు కూడా స్పందించారు. మూవీపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు.


Also read: Presidential election 2022: ఉత్కంఠ రేపుతున్న ప్రెసిడెంట్ & వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు..


Also read: Pulwama: పుల్వామాలో ఉగ్ర కుట్ర భగ్నం... ఆరుగురు ఉగ్రవాదుల అరెస్ట్...


థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook