J&K Encounter: కాశ్మీర్లో ఎన్ కౌంటర్... జైషే ఉగ్రవాది హతం.. జవాన్ వీరమరణం
J&K Encounter: జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ వీరమరణం పొందగా..జేఎం ఉగ్రవాది హతమయ్యాడు.
J&K Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో (Kulgam district) బుధవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ (జేఎం) ఉగ్రవాది (Jaish-e-Mohammad Terrorist) హతమయ్యాడు. ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ఓ పోలీసు వీరమరణం పొందారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు సహా మరో ఐదుగురు గాయపడ్డారు. హత్యకు గురైన పోలీసును రోహిత్ కుమార్‌గా గుర్తించారు. 2018 నుంచి షోపియాన్, కుల్గామ్‌లో యాక్టివ్‌గా ఉన్న పాకిస్థానీ జాతీయుడైన జేఈఎం ఉగ్రవాదిని బాబర్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి ఒక ఏకే రైఫిల్, ఒక పిస్టల్, రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలోని పరివాన్ ప్రాంతంలో (Pariwan area) ఉగ్రవాదుల ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ (cordon and search operation) నిర్వహించాయి. మెుదట ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో..సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్ కౌంటర్ గా మారిందని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసు, ఒక జైషే మహ్మద్ ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (Inspector General of Police) విజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. గత 12 రోజుల్లో కశ్మీర్‌లో జరిగిన ఎనిమిది ఎన్‌కౌంటర్లలో 14 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
Also Read: I&B Ministry Twitter: కేంద్ర సమాచార, ప్రసార శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook