ఆసుపత్రిలో కాల్పులు.. పాక్ ఖైదీ పరార్..!
మంగళవారం శ్రీనగర్ లోని శ్రీ మహారాజా హరిసింగ్ ఆసుపత్రిలో తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
మంగళవారం శ్రీనగర్ లోని శ్రీ మహారాజా హరిసింగ్ ఆసుపత్రిలో తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు పాకిస్తాన్ ఖైదీ నవీద్ ని మెడికల్-చెక్ అప్ కోసం తీసుకొచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
మీడియా కధనాల ప్రకారం, కాల్పులు జరుగుతున్న సమయంలో పాక్ ఖైదీ అక్కడి నుండి పారిపోగా.. ఉగ్రవాదులు కూడా తప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పోలీసుల అదుపులో ఉంది. ఇప్పటివరకూ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదని చెప్పారు పోలీసులు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని నెలల క్రితం సోఫియన్ లో నవీద్ని అరెస్ట్ చేశారు.
కాగా, ఆదివారం రాజౌరి జిల్లాలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నలుగురు భారత జవాన్లను పొట్టనబెట్టుకుంది.