జమ్ము కాశ్మీర్‌‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోమవారం పోలీసులే లక్ష్యంగా గ్రనేట్ దాడి చేశారు.  జమ్ము కాశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లా బతపోరా చౌక్ వద్ద ఉగ్రవాదులు పోలీస్ పార్టీపై గ్రనేట్ విసిరారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు సహా మొత్తం 16 మంది గాయపడ్డారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు బారాముల్లా యొక్క సోపోర్‌లో పోలీసులు పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేశారు. ఇది తీవ్రవాదుల చర్యగా భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించిన సమయంలో.. ఈ గ్రనేట్ దాడులు వరుసగా జరుగుతుండటం పట్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఆందోళన చెందుతున్నారు.  ట్విట్టర్ ద్వారా స్పందించిన జమ్మూ కాశ్మీర్ పూర్వపు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ దాడిని అందరూ ఖండించాలని పేర్కొన్నారు. గత వారం నుండి తీవ్రవాదులు భద్రతా దళాలు మరియు రాజకీయ నాయకులపై వరుస గ్రనేట్ దాడులకు తెగబడుతున్నారు.