Jayalalithaa`s Death: జయలలిత మృతిపై అనేక అనుమానాలు.. చిక్కుల్లో వి.కె.శశికళ అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి
Jayalalithaa`s Death: జయలలిత మృతిపై తలెత్తిన అనేక అనుమానాలు అప్పట్లోనే పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జయలలితది సహజ మరణం కాదని.. ఒక పథకం ప్రకారం చేతికి మట్టి అంటకుండా చేసిన హత్య అని అప్పట్లోనే అనేక అనుమానాలు తలెత్తాయి.
Jayalalithaa's Death: జయలలిత మృతిపై అప్పట్లో వ్యక్తమైన అనుమానాలనే నిజం చేస్తూ తాజాగా అరుముగ స్వామి కమిటీ నివేదిక సమర్పించింది. తమ నివేదికలో జయలలిత సన్నిహిత మిత్రురాలు వి.కె. శశికళ, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సి విజయభాస్కర్, అప్పటి ఆరోగ్య శాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, శశికళ బంధువు కే.ఎస్. శివకుమార్‌తో పాటు ఇంకొంత మంది పేర్లను ప్రముఖంగా ప్రస్తావిస్తూ అరుముగ స్వామి కమిషన్ సంచలన ఆరోపణలు చేసింది. అప్పటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమా మోహన్ రావుతో పాటు జయలలితకు చికిత్స అందించిన వైద్యుల పేర్లు సైతం అరుముగ స్వామి జాబితాలో ఉన్నాయి.
అరుముగ స్వామి లేవనెత్తిన సందేహాలు, ప్రశ్నలు
జయలలితకు అవసరమైన చికిత్స కోసం విదేశాలకు ఎందుకు తరలించలేదు
జయలలిత ఆరోగ్యం విషమించి పరిస్థితులు చేయిదాటిపోతున్న సందర్భంలో చికిత్స కోసం విదేశాలకు ఎందుకు తరలించలేదని ఆరుముగ స్వామి ప్యానెల్ ప్రశ్నలు లేవనెత్తింది. డా రిచర్డ్ సూచించినప్పటికీ విదేశాలకు తరలించకపోవడానికి కారణం ఏంటని అరుముగ స్వామి ప్యానెల్ ప్రశ్నించింది.
యాంజియోప్లాస్టి ఎందుకు చేయలేదు ?
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు అమెరికా, లండన్ నుంచి వచ్చిన వైద్యులు జయలలితకు యాంజియోప్లాస్టి చేయాల్సిందిగా సూచించారు. కానీ వారి సూచనలను బేఖాతరు చేస్తూ యాంజియోప్లాస్టి చేయలేదు. విదేశీ వైద్య నిపుణుల సూచనలను నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటని అరుముగ స్వామి ప్యానెల్ నిలదీసింది.
నిర్లక్ష్యం వహించారు
హాస్పిటల్ నిర్వాహకులు ఏదో ఒత్తిడి మేరకు నిర్లక్ష్యం వహించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అనుకున్నదేదో సాధించే వరకు చేయాల్సిన చికిత్సను వాయిదా వేసినట్టు కనిపించింది. అందుకే దీనిని లోతైన దర్యాప్తు అవసరమైన, విచారణార్హత కలిగిన కేసుగా భావిస్తున్నట్టు అరుముగ స్వామి ప్యానెల్ అభిప్రాయపడింది.
మృతిని ధృవీకరించడంలోనూ జాప్యం
జయలలిత మృతి చెందిన తర్వాత ఆ వార్తను బయటి ప్రపంచానికి చెప్పడంలోనూ ఆస్పత్రి వర్గాలు ఉద్దేశపూరితంగా జాప్యం చేసినట్టు అరుముగ స్వామి ప్యానెల్ ఆరోపించింది.
అపోలో హాస్పిటల్ నుంచి జయలలిత డిశ్చార్జ్ విషయంలో డా ప్రతాప్ సి రెడ్డి అబద్దం చెప్పారన్న ప్యానెల్
జయలలిత డిశ్చార్జ్ విషయంలో మీడియాకు, బయటి ప్రపంచానికి వాస్తవాలు చెప్పే హోదాలో ఉన్న అపోలో హాస్పిటల్ చైర్మన్ డా ప్రతాప్ సి రెడ్డి అలా చేయకపోగా.. ఆమె ఏ క్షణంలోనైనా డిశ్చార్జ్ అవుతారని అవాస్తవాలు చెప్పారు అని అరుముగ స్వామి ప్యానెల్ సంచలన ఆరోపణలు చేసింది. అలా ఎందుకు, ఎవరి ప్రోద్బలంతో చేయాల్సి వచ్చిందని అనుమానాలు వ్యక్తంచేసిన అరుముగ స్వామి కమిషన్.. ఆ విషయంలో నిజాలు నిగ్గుతేల్చే బాధ్యతను ప్రభుత్వానికే వదిలేస్తున్నట్టు పేర్కొంది.
ఒ పన్నీర్ సెల్వంకు అంతా తెలుసు
జయలలిత అనారోగ్యం విషయంలో ఆమె ప్రధాన అనుచరుడు పన్నీర్ సెల్వంకు అంతా తెలిసే జరిగింది. ఆస్పత్రి లోపల ఏం జరుగుతోందనేది పన్నీర్ సెల్వంకు పూర్తి అవగాహన ఉంది. అంతేకాదు.. జయలలిత మృతి ( Jayalalithaa's Death News ) అనంతరం తనను తానే తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నాడు. అందుకు పెద్ద సమయం కూడా తీసుకోలేదు. ఇదంతా పలు అనుమానాలకు తావిస్తోందని అరుముగ స్వామి కమిషన్ సందేహాలు వ్యక్తంచేసింది. ఈ నివేదికలో అనుమానితులుగా ఉన్న వాళ్లందరిపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అరుముగ స్వామి ప్యానెల్ అభిప్రాయపడింది.
Also Read : Kedarnath Helicopter Crash: కేదార్‌నాథ్ లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఆరుగురు దుర్మరణం..
Also Read : Gujarat Bus Accident: వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి