JEE Advance 2024: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి అడ్వాన్స్డ్ పరీక్షను మద్రాస్ ఐఐటీ నిర్వహిస్తోంది. రెండు సెషన్లలో మే 26న పరీక్ష నిర్వహించేందుకు మద్రాస్ ఐఐటీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తుంంటుంది. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఐఐటీల్లో ప్రవేశానికై జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుంది. 2024 జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఈసారి మద్రాస్ ఐఐటీ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇవాళ విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను మే 26న రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మే 26వ తేదీ ఉదయం 9 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకూ పేపర్ 1, మద్యాహ్నం 2.30 గంటటల్నించి 5.30 గంటల వరకూ పేపర్ 2 పరీక్ష ఉంటుంది. 


జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ 2024 ఏప్రిల్ 21 నుంచి 30 వరకూ ఉంటుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న తరువాత మే 6 వరకూ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. మే 17 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇక రెస్పాన్స్ షీట్లను మే 31న అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. ప్రాధమిక కీ జూన్ 2న , ఫైనల్ కీ జూన్ 9న విడుదలవుతుంది. జూన్ 9వ తేదీన అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు వెల్లడౌతాయి. 


జేఈఈ మెయిన్స్ పరీక్ష దరఖాస్తు స్వీకరణకు గడువు నవంబర్ 30న ముగుస్తోంది. జేఈఈ మెయిన్స్ పేపర్ 1 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ, పేపర్ 2 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకూ జరుగుతుంది. ఫిబ్రవరి 12న ఫలితాలు వెల్లడౌతాయి. ఇక కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 10న ప్రారంభమౌతుంది. 


జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్


దరఖాసుల స్వీకరణ ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ మే 17
పరీక్ష తేదీ మే 26 ఉదయం, మద్యాహ్నం
ఫలితాల వెల్లడి జూన్ 9
కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 10


Also read: PM Modi: భారీ జనసందోహంలో పార్టీ సీనియర్ కార్యకర్త.. గుర్తుపట్టి ప్రధాని మోదీ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook