JEE Advanced 2023: ఇవాళే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, అభ్యర్ధులకు అతి ముఖ్యమైన సూచనలు ఇవే
JEE Advanced 2023: దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఇవాళ జేఈఈ అడ్వాన్స్డ్ 2023 జరగనుంది. రెండు సెషన్లలో ఇవాళ జరిగే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధుల కోసం కొన్ని ముఖ్యమైన సూచనలివి..
JEE Advanced 2023: దేశంలో ప్రతిష్ఠాత్మక సంస్థ ఐఐటీల్లో ప్రవేశం కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్, అడ్వాన్స్డ్ రెండు దశల్లో జరుగుతుంది. మెయిన్స్ ఉత్తీర్ణత సాధిస్తేనే అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత ఉంటుంది. ఇవాళ దేశవ్యాప్తంగా 1.9 లక్షలమంది అడ్వాన్స్డ్ పరీక్షకు సిద్ధమయ్యారు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2023 పరీక్షను ఈసారి ఐఐటీ గువహతి నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం, మద్యాహ్నం రెండు సెషన్లలో జరగనున్న పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు ఇప్పటికే విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 1.9 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించి ఇవాళ హాజరుకానున్నారు. గత ఏడాదితో పోలిస్తే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 20 వేలమంది పెరిగారు. ఏపీలో 25, తెలంగాణలో 13 పరీక్షా కేంద్రాలుండగా అత్యధికంగా పరీక్షలకు హాజరౌతున్నది కూడా ఈ రెండు రాష్ట్రాల నుంచే.
2021లో 1.6 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయగా 2022 వచ్చేసరికి 1.7 లక్షలమంది రాశారు. ఇక ఈ సంవత్సరం 1.9 లక్షలమంది పరీక్షకు హాజరౌతున్నారు. ఉదయం పేపర్-1 పరీక్ష 9 గంటల నుంచి 12 గంటల వరకూ ఉంటుంది. మద్యాహ్నం పేపర్-2 పరీక్ష మద్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఉంటుంది. దేశవ్యాప్తంగా 1.9 లక్షలమంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాస్తుంటే కేవలం ఏపీ, తెలంగాణ నుంచే 50 వేలమంది ఉన్నారు. అదే సమయంలో అటు మెయిన్స్ పరీక్షకు కూడా ఎక్కువమంది హాజరయ్యారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ 2023 పరీక్షను రెండు సెషన్లలో కలిపి 11, 13, 325 మంది రాశారు.
ఐఐటీల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా ప్లస్ 2లో 75 శాతం మార్కులు తప్పనిసరి. కరోనా సంక్షోభం కారణంగా గత రెండేళ్లుగా ఈ షరతులో మినహాయింపు ఉండేది. ఇప్పుడు తిరిగి ఈ నిబంధన ప్రవేశపెట్టారు. ఈసారి సిలబస్‌పరంగా కూడా కొన్ని మార్పులు చేశారు. ఇవాళ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాస్తున్న అభ్యర్ధులకు కొన్ని ముఖ్య సూచనలు ఇలా ఉన్నాయి..
1. అభ్యర్ధులు నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రంలోకి 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరు.
2. అభ్యర్ధులు అడ్మిట్ కార్డు, ఫోటో ఐడీ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
3. అడ్మిట్ కార్డులో, అటెండెన్స్ షీటులో వేలిముద్ర వేసేముందు వేలు శుభ్రంగా ఉండాలి.
4. అభ్యర్ధులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి. షూ ధరించకూడదు. పెద్ద బటన్స్ ఉండే బట్టలు, ఫుల్ స్లీవ్స్ వస్త్రాలు, బంగారపు ఆభరణాలు ధరించకూడదు.
5. బాల్ పాయింట్ పెన్ ఉపయోగించాలి. పెన్సిల్, ఎరేజర్ వెంట తెచ్చుకోవచ్చు. సాధారణ వాచీలకు అనుమతి ఉంటుంది. కానీ డిజిటల్ వాచీలకు అనుమతి లేదు.
6. జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, జెండర్ సరిగ్గా ఉన్నాయో లేదో ఇప్పటికే చెక్ చేసుకుని ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook