JEE Main 2025: జేఈఈ మెయిన్స్ 2025 మొదటి విడత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. 2025 జనవరి 22 నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి ఉంటాయి. ఈసారి సిలబస్‌లో మార్పు లేకపోయినా ప్రశ్నాపత్రంలో మాత్రం మార్పు ఉంటుంది. ఇకపై ఛాయిస్ ఆప్షన్ తొలగించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ వివరాలు ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జేఈఈ మెయిన్స్ పరీక్షలు తెలుగు, ఇంగ్లీషు సహా మొత్తం 13 భాషల్లో జరుగుతుంది. పేపర్ 1 300, పేపర్ 2 400 మార్కులకు ఉంటుంది. జేఈఈ మెయిన్ పరీక్షలో గత మూడేళ్లుగా సెక్షన్ బిలో ఛాయిస్ ఉండేది. ఇకపై ఆ ఛాయిస్ విధానాన్ని పూర్తిగా తొలగించేశారు. ఇంటే మొత్తం అన్ని ప్రశ్నలు రాయాల్సి వస్తుంది. గతంలో జేఈఈ మెయిన్స్‌లో 75 ప్రశ్నలుండి ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 300 మార్కులకు ఉంటేది. మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలుండేవి. కోవిడ్ నేపధ్యంలో ప్రతి సబ్జెక్టు నుంచి ఆప్షన్ కింద ఛాయిస్ ప్రశ్నలుండేవి. అంటే ఒక్కో సబ్జెక్టులో 30 ప్రశ్నల చొప్పున 90 ప్రశ్నలిచ్చేవారు. సెక్షన్ ఏలో 20 ప్రశ్నలన్నింటికీ సమాధానం రాయాలి. సెక్షన్ బిలో మాత్రం 10 ప్రశ్నల్లో ఐదింటికి మాత్రమే సమాధానం రాయాల్సి ఉండేది. రెండు సెక్షన్లలో మైనస్ మార్కులు అప్పుడూ ఇప్పుడూ ఉంటాయి. తప్పయిన ప్రశ్నకు 1 మార్కు పోతుంది. 


జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షకు ఎలాంటి వయో పరిమితి లేదు. 2023, 2024లో 12వ తరగతి లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 2025లో 12 లేదా ఇంటర్మీడియట్ పరీక్ష రాసేవారు కూడా ఈ పరీక్షకు హాజరు కావచ్చు. నవంబర్ 22 నంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి 22 నుంచి జనవరి 31 వరకూ తొలి విడత పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరుగుతాయి. ఫిబ్రవరి 12న పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా 32 ఎన్ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీ ఉంటుంది. 


Also read: AP Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఏపీకు వర్షసూచన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.