JEE Main Result 2022: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు!
JEE Main 2022 Session 1 Results out. జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
JEE Main 2022 Session 1 Results out: జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబందించిన ఫలితాలను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెషన్ 1 పరీక్షకు 7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటారు. ఏపీ విద్యార్థులు పి ఆదినారాయణ, కె సుహాస్.. తెలంగాణకు చెందిన యశ్వంత్ వంద పర్సంటైల్ స్కోర్ సాధించారు. అందరూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక జేఈఈ మెయిన్ పరీక్షలను జూన్ 23 నుంచి 29 వరకు ఎన్‌టీఏ నిర్వహించింది. ఈ నెల 6న ఫైనల్ కీని విడుదల చేయగా.. తాజాగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ప్రస్తుతానికి జేఈఈ మెయిన్ సెషన్ 1 (బీఈ, బీటెక్) సంబంధించిన ఫలితాలను మాత్రమే విడుదల అయ్యాయి. సెషన్ 2 (బీఆర్క్, బీ ప్లానింగ్) ఫలితాలు విడుదలవ్వాల్సి ఉంది. సెషన్ 2 రిజల్ట్స్ కూడా పరీక్ష అయిన కొద్ధి రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సెషన్ 2 కోసం రిజిస్ట్రేషన్‌ను ప్రక్రియ ముగియగా.. పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకు జరుగుతాయి. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుంచి 50 వేలకు పైగా విద్యార్థులు మొదటి విడుత పరీక్షలకు హాజరయ్యారు.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గనున్న బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే
Also Read: Horoscope Today July 11 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అనూహ్య ధన లాభం!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook