JEE Mains Exam 2021: వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇవాళ ప్రారంభం
JEE Mains Exam 2021: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇవాళ ప్రారంభం కానుంది. కరోనా సంక్రమణ నేపధ్యంలో ప్రత్యేక చర్చలతో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు.
JEE Mains Exam 2021: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇవాళ ప్రారంభం కానుంది. కరోనా సంక్రమణ నేపధ్యంలో ప్రత్యేక చర్చలతో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఐఐటీ, నిట్ విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్‌కు (JEE Mains Exam 2021)సంబంధించి మార్చ్ సెషన్ పరీక్షలు కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)కారణంగా వాయిదా పడ్డాయి. తిరిగి ఇప్పుడు ప్రత్యేక గైడ్‌లైన్స్, డ్రెస్‌కోడ్, కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 7 లక్షల 9 వేల 519 మంది దరఖాస్తు చేసుకోగా..828 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి విద్యార్ధులకు గంటన్నర ముందే అనుమతిచ్చారు.ఈ పరీక్షలు ఉదయం, మద్యాహ్నం రెండు షిఫ్టులలో నిర్వహిస్తున్నారు.నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)నిర్వహిస్తున్న ఈ పరీక్షకు కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా ఫాలో కావల్సి ఉంటుంది. కరోనా సంక్రమణ నేపధ్యంలో పరీక్ష కేంద్రాల్ని 660 నుంచి 828కు పెంచారు. అదే విధంగా 232 నగరాల్లో జరిగే పరీక్షను ఈసారి 334 నగరాల్లో నిర్వహిస్తున్నారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కాంటాక్ట్ లెస్‌గా ఉంటుంది. పరీక్ష కేంద్రంలో కూడా భౌతిక దూరం పాటించాలి. ఒక ఫిఫ్ట్‌లో వినియోగించిన కంప్యూటర్లను మరో షిఫ్టులో ఉపయోగించరు. అభ్యర్ధికి శానిటైజర్ అందిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్ధులు గుమిగూడకుండా స్లాట్‌లు కేటాయిస్తారు.
Also read: Fuel Prices: పెట్రోల్, డీజిల్ ధరల్ని జీఎస్టీలో చేర్చే విషయమై స్పష్టత ఇచ్చిన కేంద్రం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook