JEE Mains Examinations 2021: జాతీయ స్థాయి జేఈఈ మెయిన్స్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా మూడ్రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు అందరూ కోవిడ్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని ఎన్‌టీ‌ఏ సూచించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్..జేఈఈ మెయిన్స్ పరీక్ష (JEE Mains Exams)లకు 5 లక్షల మంది విద్యార్ధులు సన్నద్ధమయ్యారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షలు రేపటి నుంచి మూడ్రోజులపాటు రెండు సెషన్లలో జరగనున్నాయి. గతంలో ఒకేసారి జరిగే పరీక్షల్ని 2021 నుంచి నాలుగు విడతల్లో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో 4 రోజుల చొప్పున, మే నెలలో 5 రోజుల పాటు పరీక్షల్ని కంప్యూటర్ ఆధారితంగా ఎన్‌టీ‌ఏ నిర్వహిస్తోంది. 


ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకూ తొలి విడత పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సెషన్‌కు 6.5 లక్షల మంది అభ్యర్ధులు హాజరు కాగా..మార్చ్ సెషన్‌ను 15 నుంచి 18 వరకూ ముందు షెడ్యూల్ విడుదలైంది. అయితే అభ్యర్ధుల సంఖ్య తక్కువగా ఉండటంతో మార్చ్ సెషన్ పరీక్షల్ని మూడ్రోజులకు కుదించి..16 వ తేదీ నుంచి 18వ తేదీవరకూ పరిమితం చేశారు. రెండవ  సెషన్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి 53 వేల మంది అభ్యర్ధులు పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్రంలో 20 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. 


పరీక్షల నిర్వహణలో కోవిడ్ 19 నియమాల్ని పాటించేలా ఎన్‌టీ‌ఏ (National Testing Agency) చర్యలు చేపట్టింది. సిబ్బందితో పాటు పరీక్షలకు హాజరయ్యేవారంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. సిబ్బందికి గ్లౌజ్‌లకు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్ని శానిటైజేషన్ చేయిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యేవారు తమ వెంట  పారదర్శకంగా కన్పించే శానిటైజర్లను తెచ్చుకోడానికి అనుమతిస్తున్నారు. పారదర్శక బాటిళ్లలో మంచినీరు, పారదర్శకంగా కన్పించే పెన్నుల్ని కూడా అనుమతిస్తున్నారు. సెల్ ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. మొదటి సెషన్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 వరకూ, రెండవ సెషన్ మద్యాహ్నం 3 గంటల్నించి 6 గంటల వరకూ జరగనున్నాయి. అడ్మిట్ కార్డుతో పాటు ఫోటో ఐడెంటిటీ వెంట తెచ్చుకోవల్సి ఉంటుంది. 


Also read: Whatsapp new feature: వాట్సప్ కొత్త ఫీచర్ త్వరలో ఇండియాలో కూడా, ఇక చాటింగ్‌ను మరింత ఎంజాయ్ చేయవచ్చు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook