న్యూఢిల్లీ: పుల్వామా దాడుల అనంతరం పాకిస్తాన్‌తోపాటు పాక్‌లో ఆశ్రయం పొందుతున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ, ఆ సంస్థ అధినేత మసూద్ అజార్‌పై జీ న్యూస్ వరుస కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో జీ న్యూస్ వరుస కథనాలతో బెంబేలెత్తిన జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థ.. తాజాగా జీ న్యూస్ మీడియా సంస్థపై విషం చిమ్ముతూ తమ సొంత ఆన్‌లైన్ మ్యాగజైన్ అయిన అల్ ఖలంలో ఓ సంపాదకీయ కథనాన్ని ప్రచురించింది. జీ న్యూస్‌తోపాటు జీ న్యూస్ ఛానెల్లో వార్తల్ని విశ్లేషిస్తూ కొనసాగే ప్రత్యేక కార్యక్రమం 'డైలీ న్యూస్ ఎనాలసిస్'(డీఎన్ఏ), జీ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ సుధీర్ చౌదరి పేర్లను అల్ ఖలం వార్తా కథనంలో ప్రస్తావించిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ... పాకిస్తాన్‌పై, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై జీ న్యూస్ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని పేర్కొంది.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ గొంతుకను వినిపించే అల్ ఖలం ఆన్‌లైన్ మ్యాగజైన్ సంపాదకులు జీ న్యూస్ కథనాలపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించారంటే, జీ న్యూస్ కథనాలు వారిపై ఏ స్థాయిలో ప్రభావితం చేశాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దేశానికి, జాతి ఐక్యమత్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ దేశభక్తి చాటుకునే క్రమంలో జీ న్యూస్ ప్రచురించే కథనాలు జైషే మహ్మద్‌పై తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయని అల్ ఖలం ప్రచురించిన సంపాదకీయ కథనమే నిరూపిస్తోంది.  


READ THIS NEWS IN ENGLISH : JeM mouthpiece mentions Zee News, DNA and Sudhir Chaudhary over its fearless reporting on Pulwama attack


'' నెగటివ్ అండ్ కండెమ్నబుల్ ఫేస్ ఆఫ్ ది ఇండియన్ మీడియా'' అనే శీర్షికతో అల్ ఖలం ప్రచురించిన సంపాదకీయ కథనం చూస్తే, పుల్వామా దాడులకు తామే బాధ్యులం అని ప్రకటించుకున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు ఇప్పుడు జీ న్యూస్‌ను చూస్తే ఎందుకంత వణికిపోతోందనే సందేహం రాకమానదు. 


యుద్ధం మాత్రమే భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతుందని సుధీర్ చౌదరి తన డైలీ న్యూస్ ఎనాలసిస్ (డీఎన్ఏ) కార్యక్రమంలో అభిప్రాయపడినట్టుగా అల్ ఖలం కథనం పేర్కొంది. అంతేకాకుండా బంగ్లాదేశ్ ఏర్పాటవడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని చెప్పిన సుధీర్ చౌదరి.. బలుచిస్తాన్‌లో పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని వెనకేసుకొచ్చారని అల్ ఖలం కథనం స్పష్టంచేసింది. పాకిస్తాన్‌పై భారత భద్రతా బలగాలు కఠిన వైఖరి అవలంబించాల్సిన అవసరం ఉందని సుధీర్ చౌదరి పదేపదే సూచిస్తుంటారని అల్ కలం కథనం పేర్కొంది.