Jharkhand Politics: ఊహించిందే జరిగింది. మొత్తానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జార్ఘండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేశారు. అరెస్టు కంటే ముందే ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేయడం గమనార్హం. కొత్త ముఖ్యమంత్రిగా జేఎంఎం పార్టీ సీనియర్ నేత చంపయ్ సోరెన్ ఎంపికయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భూ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసు జార్ఘండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు పదవి వదులుకునేలా చేసింది. తీవ్ర ఉత్కంఠ పరిణామాల నేపధ్యంలో హేమంత్ సోరెన్ ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 7 గంటలసేపు రాంచీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసంలో విచారణ కొనసాగింది. విచారణ సమయంలో జేఎంఎం కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున ఈడీకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ హల్‌చల్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హేమంత్ సోరెన్‌ను లక్ష్యంగా చేసుకుని విచారణ పేరుతో మండిపడుతోందని జేఎంఎం నేతలు ఆరోపించారు. 


దాదాపు 7 గంటల విచారణ అనంతరం నిన్న రాత్రి 9.30 గంటలకు హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ అంటే ఫిబ్రవరి 1 గురువారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టు అనుమతితో తిరిగి ఆయనను కస్టడీలో తీసుకోవచ్చు. ఈడీ విచారణకు ముందే హేమంత్ సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం కొత్త ముఖ్యమంత్రిగా పార్టీ సీనియనర్ నేత చంపయ్ సోరెన్‌ను జేఎంఎం ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 


జార్ఘండ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన చంపయ్ సోరెన్ హేమంత్ సోరెన్ తండ్రి శిబూ సోరెన్‌కు సన్నిహితుడు. జార్ఘండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి. 1991 నుంచి వరుసగా గెలుస్తున్నారు. 


Also read: Interim Budget 2024: మరి కాస్సేపట్లో నిర్మలమ్మ బడ్జెట్, ఎన్నికల తాయిలాలు ఉంటాయా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook