రాంచీ: కరోనావైరస్‌ వ్యాప్తిని (Coronavirus spread) అరికట్టేందుకు కేంద్రం లాక్‌డౌన్ (Lockdown) విధించడంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా పోలీసులు ప్రజల కోసం ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వర్తిస్తూ లాక్‌డౌన్ విజయవంతంగా అమలయ్యేందుకు ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. ఓవైపు తమ కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతున్న పోలీసులను చూసి గౌరవించకుండా ఉండలేకపోతున్న జనం... మరోవైపు లాక్ డౌన్ పేరిట అరాచకాలకు (Police atrocities) పాల్పడుతున్న పోలీసులను చూసి చీదరించకుండానూ ఉండలేకపోతున్నారు. పోలీసులను మెచ్చుకుంటున్న అదే జనమే.. పోలీసులను చీదరించుకునేలా చేసిన ఘటన ఒకటి జార్ఖండ్ రాజధాని రాంఛీలో (Ranchi) మంగళవారం చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : 3.2 లక్షల మంది కరోనా రోగుల కోసం 20,000 బోగీలతో ఐసోలేషన్ వార్డులు


రాంచీలోని హింద్‌పురి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై పోలీసులు (Jharkhand police) తమ పైశాచికాన్ని ప్రదర్శించారు. విచక్షణరహితంగా దాడిచేయడంతో పాటు అతడిచేత బలవంతంగా మూత్రం తాగించారు. చిరు వ్యాపారిగా భావిస్తున్న ఆ యువకుడిపై పోలీసుల దాష్టికానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


Read also : ఉప్పు.. ఆరోగ్యానికి పెద్ద ముప్పు!


యువకుడిపై పోలీసుల దాడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు.. హింద్‌పురి పోలీసులపై ఆందోళనకు దిగారు. యువకుడిపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. స్థానికుల ఆందోళనపై స్పందించిన డీఎస్పీ.. హింద్‌పిరి ఎస్సైని సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణ అనంతరం ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని రాంచీ ఎస్ఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. జనం కోసం త్యాగం చేస్తోన్న పోలీసులపై అదే జనానికి కోపం తెప్పించిన ఈ ఘటన పోలీసులపై మాయని మచ్చగా మిగిలిపోయింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..