Jawahar Navodaya Vidyalaya Application Form: జాతీయ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతి అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి ఉత్తీర్ణలైన విద్యార్ధులను ప్రవేశ పరీక్ష ద్వారా 6వ తరగతిలో ప్రవేశాలు జరుగుతుంటాయి. అప్లికేషన్లను navodaya.gov.in ఆన్‌లైన్  ద్వారా సమర్పించాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతి అడ్మిషన్లకు సంబంధించిన అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది. 6వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్ధులు ఆన్‌లైన్ ద్వారా అధికారిక పోర్టల్ navodaya.gov.in ఓపెన్ చేసి అప్లికేషన్ దాఖలు చేయాలి. అప్లికేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 16.  ఆసక్తి కలిగిన, అర్హులైన విద్యార్థులు చివరి తేదీ సెప్టెంబర్ 16 లోగా అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. జవహర్ నవోదయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inలో అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరం నాటికి 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతి అడ్మిషన్లకు అర్హులు. అప్లికేషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత ప్రవేశ పరీక్ష ఉంటుంది. అడ్మిట్ కార్డు, పరీక్ష తేదీ, ఫలితాల తేదీ తరువాత వెల్లడిస్తారు.


ఎలా దరఖాస్తు చేయాలి


ముందుగా నవోదయ విద్యాలయ వెబ్ సైట్ navodaya.gov.in ఓపెన్ చేయాలి. ఇందులో 6వ తరగతి అప్లికేషన్ లింక్ క్లిక్ చేయాలి. తరువాత అడిగిన వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తరువాత ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫిల్ చేసి తగిన ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి. 


నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 ప్రకారం జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రభుత్వం నెలకొల్పింది ప్రస్తుతం ఈ విద్యా సంస్థలు 27 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే కో ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్. జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ ద్వారా అడ్మిషన్లు జరుగుతుంటాయి. 


Also read: 7th Pay Commission Latest News: గుడ్‌న్యూస్, సెప్టెంబర్‌లో 3 శాతం డీఏ పెంపు, భారీగా పెరగనున్న జీతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook