కృష్ణ జింకల వేట కేసు నిందితుడిగా ఉన్న సల్మాన్ ఖాన్ కు ఈ కేసులో బెయిల్ తీసుకున్నారు. అయితే ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈరోజు విచారణకు సల్మాన్ డుమ్మా కొట్టడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే వారం కోర్టుకు హాజరుకాకపోతే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ లో ఈ కేసుకు సంబంధించిన వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను జూలై 4కు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఈ రోజు విచారణ జరిగిన విచారణకు సల్మాన్ హాజరుకాలేదు. ఈ పరిణామంపై ఆగ్రహించిన కోర్టు ఈ కేసులో సల్మాన్ ఖాన్ కచ్చితంగా విచారణకు హాజరుకావాలని ఆయన తరపు న్యాయవాదులకు సూచించింది. లేందంటే బెయిల్ ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఘాటుగా హెచ్చరించింది