June Rules: అవును జూన్ నెలలో దేశ వ్యాప్తంగా పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ సహా పలు కీలక మార్పులు జూన్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధార్ అప్డేట్..
UIDAI ఆధార్ ఇపుడు భారతీయుల జీవనంలో ఒక భాగం అయింది. బ్యాంక్, సిలిండర్, పాస్‌పోర్ట్ సహా ప్రతి ఒక్కదానికి ఆధార్ కంపల్సరీ.  ఇది ప్రతి ఐదు నుంచి పదేళ్లకు ఒకసారి అప్డేట్ చేయాల్సి ఉంది. ఈ సారి ఆధార్ కార్డ్‌ను జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అదే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి వస్తే ఒక్కో అప్‌డేట్‌కు 50 రూపాయలు చెల్లించాలి.


గ్యాస్ సిలండర్ రేట్
 
దేశ వ్యాప్తంగా ఉన్న చమురు కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదిని గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడమో.. పెంచడమే చేస్తూ ఉంటుంది. మే నెలలో దేశ వ్యాప్తంగా ఆయిల్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ రేట్స్‌ను తగ్గించాయి. ఇక గృహ వినియోగదారులు ఉపయోగించే సిలిండర్ ధరతో పాటు కమర్షియల్ సిలిండర్ ధరలను జూన్ 1న అప్డేట్ చేయనున్నారు.  


బ్యాంక్ సెలవులు


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ నెలలో దాదాపు 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ప్రకటించింది. ఈ జాబితో ఆదివారం, రెండు, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి. మరోవైపు జూన్ నెలలో ముస్లిమ్ సోదరులకు సంబంధించిన బక్రీద్ కూడా ఉంది. ఇక బ్యాంకు లావాదేవీలు జరిపే వీళ్లు ఈ విషయాన్ని గమనించి తమ బ్యాంకింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి.


ట్రాఫిక్ రూల్స్
జూన్ 1 నుంచి ట్రాఫిక్ నిబంధనల్లో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ కూడా జూన్ 1 నుంచి ఇంప్లిమెంట్  కానుంది.


మాములు స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్‌తో బండి నడిపితే.. వెయ్యి రూపాయల నుంచి 2 వేల వరకు ఫైన్ కట్టాలి.


అదే టైమ్‌లో టూ వీలర్, ఫోర్ వీలర్ లెసెన్స్ లేకుండా బండి నడిపిస్తే రూ. 500 వరకు జరిమానా కట్టాలి.


సీటు బెల్టు, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే రూ. 100 వరకు ఫైన్ వేస్తారు.


18 యేళ్ల లోపు మైనర్ బాలబాలికలు వాహనాలు నడిపితే.. రూ. 25 వేల వరకు


మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు. అంతేకాదు పాతికేళ్ల వరకు  డ్రైవింగ్ లెసెన్స్ రాకుండా చేస్తారు. మొత్తంగా జూన్ 1 తర్వాత బండితో ఆటు ఇతర వ్యవహారాలు జరిపేటపుడు వీటిని గుర్తుపెట్టుకోవాల్సిందే.


Also read: AP Elections Survey: ఏపీలో అధికారం ఎవరిది, జగన్‌కు క్లారిటీ వచ్చేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook