New CJI: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్ ఉదయ్ ఉమేష్‌ లలిత్ పేరును ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. ఇందులోభాగంగా కేంద్ర న్యాయ శాఖకు ఆయన లేఖ రాశారు. ఆ లేఖను ప్రధాని కార్యాలయానికి కేంద్ర న్యాయ శాఖ పంపనుంది. ప్రధాని మోదీ ఆమోదం తర్వాత రాష్ట్రపతి పేసీకి వెళ్లనుంది. ఆయన పచ్చజెండా ఊపగానే అధికారిక ప్రకటన రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం తదుపరి సీజేఐ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవి విరమణ ఈనెల 26న చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టే వ్యక్తి పేరును ప్రతిపాదిస్తారు. ఇందులోభాగంగా జస్టిస్ ఉదయ్ ఉమేష్‌ లలిత్‌ పేరును ఆయన సిఫార్సు చేశారు. ఈనెల 27న సీజేఐగా ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయన పదవికాలం మూడు నెలల్లో ముగియనుంది. నవంబర్ 8న లలిత్ పదవీ విరమణ చేయనున్నారు. 


1957 నవంబర్ 9న జస్టిస్ ఉదయ్ ఉమేష్‌ లలిత్ జన్మించారు. 1983 జూన్‌లో న్యాయవాదిగా మారారు. 1985 డిసెంబర్ వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. 1986 జనవరి నుంచి సుప్రీంకోర్టులో తన ప్రాక్టీసు మొదలు పెట్టారు. 2014 ఆగస్టు 13న అత్యున్నత న్యాయ స్థానంలో న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. నాటి నుంచి అనేక కీలక తీర్పుల్లో ఉన్నారు. దేశంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన త్రిపుల్ తలాక్‌తోపాటు అనేక కీలక తీర్పుల్లో భాగస్వామ్యం అయ్యారు. 


ట్రిపుల్ తలాక్ విధానంలో విడాకులు చెల్లుబాటు కావని కీలక తీర్పు ఇచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని 2017లో తీర్పు ఇచ్చారు. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ లలిత్ సభ్యుడిగా ఉన్నారు. కేరళలోని పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కు అప్పటి రాజ కుటుంబానికి ఉంటుందని ఆయన ఆధ్వర్యంలోని కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇలా కీలక తీర్పుల్లో భాగస్వామ్యం అయ్యారు.


Also read:Munugode ByElection: ఇదేందయా ఇది.. కాంగ్రెస్ దూకుడుతో టీఆర్ఎస్ లో సంబరం!


Also read:YSRCP Leaders: ఏపీలో వివాదాస్పదమవుతున్న వైసీపీ నేతల తీరు..ఆ పార్టీ అధిష్టానం సీరియస్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook