మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు .. రోజు రోజుకు ముదురుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, యువ నేత జ్యోతిరాదిత్య సింధియా మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వారిద్దరి మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైతు రుణమాఫీల కోసం జ్యోతిరాదిత్య సింధియా  సొంత పార్టీ పైనే గళం ఎత్తుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన రైతు రుణమాఫీలపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై రగడ జరుగుతోంది.  ఇరువురు నేతలను బుజ్జగించేందుకు అధిష్ఠానం ఓసారి ప్రయత్నించింది. కానీ జ్యోతిరాదిత్య సింధియా  వెనక్కి తగ్గడం లేదు. రైతు రుణమాఫీ అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేని పక్షంలో రోడ్లపైకి వెళ్తానని హెచ్చరించారు.  


తాజాగా మరోసారి కాంగ్రెస్ కు జ్యోతిరాదిత్య సింధియా ఝలక్ ఇచ్చారు.  తాను ప్రజా సేవకుడినని చెప్పుకున్నారు.  ప్రజలకు ఇచ్చిన హామీలపై పోరాటం చేయడం నా ధర్మమని గ్వాలియర్ లో తెలిపారు.  ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఉందని కాంగ్రెస్ నేతలుకు గుర్తు చేశారు. ఒక వేళ అలాంటి హామీలు నెరవేరేటట్లు కనిపించకపోతే పోరుబాట తప్పదని హెచ్చరించారు.


Read Also: మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు


ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన మధ్యప్రదేశ్ ముఖ్యంత్రి కమల్ నాథ్.. రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. జ్యోతిరాదిత్య సింధియా విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా .. రోడ్లపైకి వస్తే రమ్మనండి .. అంటూ చెప్పి వెళ్లిపోయారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..