Tamil Nadu Assembly Elections 2021: తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి మరోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా ఎడప్పాడి నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2021కు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం నాడు ఎడప్పాడిలో అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ ఎన్నికలు తమిళనాడు ప్రజలకు కొంత వరకు భిన్నంగా అనిపిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు కొన్ని దశాబ్దాల తరువాత తమిళనాడు దివంగత ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి లేకుండా తొలిసారిగా వారి మరణాననంతరం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల శశికళ జైలు శిక్ష పూర్తి చేసుకుని రావడం లాంటి ఎన్నో కీలక విషయాలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల(Tamil Nadu Assembly Elections)ను ప్రభావితం చేయనున్నాయి. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నికల బరిలో నిలవకుండా వెనక్కి తగ్గారు. అయితే మరో అగ్రనటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యంను ఎన్నికల బరిలో నిలుపుతున్నారు.  


Also Read: Bank Strike: బ్యాంకు సమ్మెలో 10 లక్షల మంది ఉద్యోగులు, అందుబాటులో ATM సేవలు



భారీ హామీలు, ఉచితాలు అంటూ అధికార అన్నాడీఎంకే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఏకంగా 163 హామీలతో కూడిన మేనిఫెస్టోను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి విడుదల చేశారు. రేషన్ కార్డు ఉంటే చాలు.. అమ్మ వాషింగ్ మెషీన్లు, ఇళ్లు లేనివారికి పక్కా గృహాలు, మహిళల కోసం ఇంటి దీపం పథకం, ఏడాదికి ఆరు సిలిండర్లు వంటి హామీలతో AIADMK తమ మేనిఫెస్టోను తీసుకొచ్చింది. ఓటర్లను ఆకర్షించేందుకు అన్నీ ఉచితం అంటూ ఫ్రీ మేనిఫెస్టోను అధికార అన్నాడీఎంకే పార్టీ విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.


Also Read: Tamilnadu Assembly Elections 2021: ఆల్ ఫ్రీ మేనిఫెస్టో విడుదల చేసిన అన్నాడీఎంకే 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook