విలక్షణ నటుడు కమల్ హాసన్ ఆర్కే నగర్ ఎన్నికలపై స్పందించారు. కేవలం ధన బలంతోనే అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనళ్లుడు టీటీవీ దినకరన్  ఆర్కే నగర్ ఉపఎన్నికలో గెలుపొందాడని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో, తమిళనాడు రాజకీయాలకు ఆర్కే నగర్ ఉపఎన్నిక ఒక మాయని మచ్చ అని తీవ్రంగా ఆరోపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక తమిళ్ మ్యాగజిన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.  కేవలం ధనబలం తో దినకరన్ గెలుపొందాలని.. ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెట్టాడని ఆరోపించారు. అన్నాడీఎంకే కూడా ఓటర్లను ప్రలోభపెట్టిందని..పాలక ప్రభుత్వం కూడా ఉపఎన్నికలను సవాలుగా తీసుకుందని.. వాళ్లు కూడా డబ్బులు పంచారని తెలిపారు. ఈ ఫ్లోలోనే కమల్ ఓటర్లకు క్లాస్ పీకారు. ఎవరైతే ఆర్కే నగర్ ఉపఎన్నికలో డబ్బులు తీసుకున్నారో వారిని ఉద్దేశిస్తూ.. మీరు అమ్ముడుపోయారంటూ వ్యాఖ్యానించారు. 


కమల్ హసన్ ఆరోపణలకు ప్రతిస్పందించిన దినకరన్ అవార్డులు గెలుచుకొనే స్టార్, ఆర్కే నగర్ ఓటర్లను అవమానించాడని.. వారి మనసులను గాయపరిచాడని అన్నారు. నువ్వు అంగీకరించిన, లేకపోయినా ఆర్కే నగర్ ఓటర్లు నాకు ఓటేశారు. ఆ ప్రేమగల ప్రజలను హర్ట్ చేయొద్దు (అలాంటి ఆరోపణలు చేయడం)" అని దినకరన్ చెప్పారు.