విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ బుధవారం రాజకీయ పార్టీని స్థాపించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే..! ఆయన ఫిబ్రవరి 21 చరుగ్గా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. తమిళనాడు మదురైలో నిర్వహించిన తలపెట్టిన బహిరంగసభలో కమల్ రాజకీయ పార్టీని ప్రకటించి, విధివిధానాలను  వెల్లడిస్తారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత, విజయ్ కాంత్‌ ఇలా అందరూ తమ రాజకీయ తొలి అడుగును మథురై జిల్లా నుంచే ప్రారంభించడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆహ్వానితులు వీరే..!


ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌, వామపక్ష పార్టీలకు చెందిన సీనియర్‌ నేతలు హాజరుకానున్నారు.


కమల్‌ హాసన్‌ మదురైలో పార్టీని ప్రకటించిన అనంతరం రామేశ్వరం వెళ్లనున్నారు. అక్కడ ఉన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమాధిని దర్శించుకొని.. రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆయన తమిళనాడు ప్రజలను నేరుగా కలుసుకొని..వారి కష్టసుఖాలను, ఆకాంక్షలు తెలుసుకొన్నారు.


రాజకీయ పార్టీ ప్రారంభానికి ముందు కమల్‌ హాసన్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరితో పాటు నాం తమిళర్ కట్చి చీఫ్ కో-ఆర్డినేటర్ సీమన్, కృష్ణస్వామి భాగ్యరాజ్, డీ రాజేంద్రన్ లతో సమావేశమయ్యారు.