మధ్యప్రదేశ్ సర్కారు.. సంక్షోభం దిశగా పయనిస్తోంది. అధికార పార్టీ కాంగ్రెస్  కు చెందిన సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేయడం ..  19 మంది ఎమ్మెల్యేలు ఏకంగా ఎమ్మెల్యే పదవులకే రాజీనామా ఇచ్చేయడంతో ..  కాంగ్రెస్ అధిష్ఠానానికి భారీ షాక్ తగిలింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తంగా మధ్యప్రదేశ్  లో 'ఆపరేషన్ లోటస్'..  సక్సెస్ అయినట్లుగానే కనిపిస్తోంది.  దీంతో కమలనాథుల చేతిలో సీఎం కమల్ నాథ్ కు రంగు పడింది. హోలీ పండగనాడు. . సీఎం కమల్ నాథ్ పై రంగు పడిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సీఎం కమల్ నాథ్ కు ప్రధాని నరేంద్ర మోదీ రంగులు అద్దుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది. దీన్ని నెటిజనులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.



మొత్తం  మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 19 మంది రాజీనామాలు సమర్పించారు. వారిలో ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఐతే కాంగ్రెస్ కు చెందిన వారు 17 మంది కావడంతో.. ఇప్పుడు హస్తం పార్టీ బలం 97కు పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 116. కాబట్టి కమల్ నాథ్ సర్కారు నిలబడాలంటే 19 మంది ఎమ్మెల్యేలు అవసరం. అటు బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే.. ఉప ఎన్నికలు  రావడం ఖాయం. అప్పటి ఫలితాలను బట్టి సర్కారు ఎవరిదనేది తేలుతుంది.  


Read Also: కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో ఇదిగో.. !!


మరోవైపు కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోవడంతో రెండు స్థానాలు ఖాలీగా ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల తర్వాతే అవి కూడా జరిగే అవకాశం ఉంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..