Kanchajungha express  accident:  వెస్ట్ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన జంగ ఎక్స్ ప్రెస్ ట్రైన్ వేగంగా వచ్చి, గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది. న్యూజల్పాయి గుడిలో  ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.  ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. . ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాంచన జంగ ట్రైన్ ఏకంగా గూడ్స్ రైలు మీదకు ఎక్కేసింది. రైలు ప్రమాద ఘటకు సంబంధించిన  వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్ కతాలోని సెల్దాకు కాంచన్ జంఘా ఎక్స్ ప్రెస్ మధ్యలో న్యూజల్ పాయి గుడి వద్ద ఆగింది.  అక్కడి నుంచి బయలు దేరిన కాసేటికే రంగపాని స్టేషన్ వద్ద వెనుక నుంచి ఒక గూడ్స్ ను ఎక్స్ ప్రెస్ బలంగా ఢీకొట్టింది. రైలు ఏకంగా మరో వైపు ఎక్కేసింది. రైలులో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. రైలు అధికారులు అక్కడికి చాలా సేపటికి రాలేదని స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలో రెస్య్కూ సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి ఆలస్యంగా వచ్చారంటూ రైలులోని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. 


రైలు ఢీకొన్న ఘటనలో ఇప్పటి దాక.. ఐదుగురు రైలు ప్రయాణికులు మరో 25 మంది రైలు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో ప్రస్తుతం సహయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.  ఈ మేరకు అభిషేక్ రాయ్, డార్జిలింగ్ పోలీసు అదనపు ఎస్పీ వివరాలు వెల్లడించారు. బాధితులందరికి మెరుగైన వైద్యసేవలు అందించాలని కూడా సీఎం మమతా ఆదేశించారు.


Read more; Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter