Kangana - Emergency Postponed: బాలీవుడ్ నటి కంగనా మంచి నటిగానే కాదు.. నిర్మాతగా, దర్శకురాలిగా సత్తా చూపెడుతోంది. తాజాగా ఈమె స్వీయ దర్శకత్వంలో 'ఎమర్జన్సీ' మూవీని తెరకెక్కించింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశ ప్రజలపై విధించిన ఎమర్జన్సీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించింది. ఇప్పటికే దేశంలో ఎమర్జీన్సీ విధించి వచ్చే నెల 25కు 49 యేళ్లు పూర్తవుతోంది. అప్పట్లో 1971లో రాయ్ బరేలి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యేందకు తన అధికారాన్ని దుర్వినయోగం చేసినట్టు అలహాబాద్ హైకోర్టు జడ్జ్ జగ్‌మోహన్ లాల్ సిన్హా యూపీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో తీర్పు ఇవ్వడం అప్పట్లో సంచలనం రేపింది. తన పదవికే ముప్పు ఏర్పడటంతో రాజ్యాంగంలోని అంతర్గత భద్రతా చట్టం ఆర్టికల్ 352 ప్రకారం.. జూన్ 25 అర్ధరాత్రి క్యాబినేట్ ఆమోదంతో ఎమర్జన్సీ విధించింది. అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జీన్సీకి అనుమతి ఇచ్చారు. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 నెలల పాటు ఈ ఎమర్జన్సీ కొనసాగింది. ఈ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా కంగనా వాయిదా వేసింది. ప్రస్తుతం జరగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో కంగనా ఈ సినిమాను వాయిదా వేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు బీజేపీ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తోంది. తాజాగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు రూ. 90 కోట్ల వరకు ఉన్నట్టు పేర్కొంది. ఈ సారి ఎన్నికల్లో కంగనా సొంత రాష్ట్రంలోని సొంత ప్రదేశంలోనే ఎంపీగా పోటీ చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కంగనా కూడా ఇదే లోక్‌సభ నియోజకవర్గంలో పుట్టి పెరిగింది. తొలిసారి కంగనా ఎన్నికల బరిలో తన లక్ పరీక్షించుకోబోతుంది.


ఇదీ చదవండి అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!