Kangana Ranaut : సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ కంగనాకు ఢిల్లీ అసెంబ్లీ నుంచి సమన్లు
Kangana Ranaut summoned by Delhi Assembly`s Committee for her alleged remarks on Sikhs : ఏడాది కాలంగా రైతులు చేసిన ధర్నాలను ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణిస్తూ కంగనా ఆరోపణలు చేసింది. దీంతో సబ్ అర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆమె కావాలనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు.
Kangana Ranaut Summoned By Delhi Assembly Panel Over Remarks On Sikh Community: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. సిక్కులపై (Sikhs) అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ కంగనాకు నోటీసులు (Notices) వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ చద్దా ప్యానెల్ ముందు డిసెంబర్ ఆరో తేదీన హాజరుకావాలంటూ ఆదేశించారు. సిక్కులను కించపరిచే రీతిలో కంగనా రనౌత్ (Kangana Ranaut) కామెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సోషల్ మీడియా సిక్కులపై అనుచిత రీతిలో వ్యాఖ్యలు చేసిదంటూ కంగనా రనౌత్‌పై ముంబైలో (Mumbai) కూడా కేసు నమోదైంది. అయితే ఏడాది కాలంగా రైతులు చేసిన ధర్నాలను ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణిస్తూ కంగనా ఆరోపణలు చేసింది. దీంతో సబ్ అర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆమె కావాలనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు.
Also Read : IND vs NZ 1st Test:మయాంక్ విఫలం..చెలరేగిన గిల్! లంచ్ బ్రేక్ కు భారత్ స్కోర్ ఎంతంటే??
సిక్కులను అణిచివేసింది ఒక్క ఇందిరా గాంధీ (Indira Gandhi) మాత్రమే అని.. మాజీ ప్రధాని ఇందిర గాంధీ దేశ విభజన చేయకుండా సిక్కులను అడ్డుకున్నట్లు కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రైతుల తీరును కూడా కంగనా తప్పుపట్టారు.
అయితే కంగనా తనపై కేసు నమోదు కావడంపై కూడా తాజాగా కాస్త డిఫరెంట్‌గా సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ షేర్ చేసింది. చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని గతంలోని ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. మరొక రోజు మరో ఎఫ్ఐఆర్... ఒకవేళ వాళ్లు నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..ఇంటి దగ్గర నా మూడ్ ఇలా ఉంటుందంటూ కంగనా రనౌత్ (Kangana Ranaut) క్యాప్షన్ ఇచ్చింది.
Also Read : Tomato prices: ప్రభుత్వం చొరవతో అక్కడ కిలో టమాటా ధర రూ.85-100..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook