న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాను విడుదల చేసింది. ప్రపంచంలో 15 అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో 14 భారత్‌లోనే ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఢిల్లీ, వారణాసి, కాన్పూర్‌, ఫరీదాబాద్‌, గయా, పాట్నా, ఆగ్రా, ముజఫరాపూర్‌, శ్రీనగర్‌, గురుగ్రామ్‌, జైపూర్‌, పటియాలా, జోధ్‌పూర్‌లు భారత్‌లో అత్యంత కాలుష్యపూరిత నగరాలుగా డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ జాబితాలో కాన్పూర్ అత్యంత కాలుష్యపూరిత నగరాలలో టాప్‌లో ఉంది. 2016లో వివిధ నగరాల్లో నమోదైన కాలుష్య శాతం ఆధారంగా వీటిని ప్రకటించినట్లు తెలిపింది. ప్రపంచంలోని ప్రతి 10 మందిలో తొమ్మిది మంది కాలుష్యపూరిత గాలిని శ్వాసిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వివరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 అత్యంత కాలుష్య పూరిత నగరాలు


15. అలీ సుబాహ్‌ అల్‌ సలేం (కువైట్)
14.జోధ్‌పూర్‌
13. పటియాలా
12. జైపూర్
11. గురుగ్రామ్
10. శ్రీనగర్
9. ముజఫరాపూర్
8. ఆగ్రా
7. లక్నో
6. ఢిల్లీ
5. పాట్నా
4. గయా
3. వారణాసి
2. ఫరీదాబాద్
1. కాన్పూర్


గాలిలో సల్ఫేట్‌, నైట్రేట్‌, బ్లాక్‌ కార్బన్‌ కారకాలు ఉండడం వల్ల మనిషి ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దాదాపు 70 లక్షల మరణాలు ఏటా వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్నాయని వివరించింది. గుండె జబ్బులతో, శ్వాసకోస సంబంధిత వ్యాధులతో, ఊపరితిత్తుల క్యాన్సర్‌తో మరణిస్తున్నారని తెలిపింది. నగరాల్లో కలుషిత వాయువులను నిరోధించేందుకు చర్యలు తీసుకోకుంటే  భారీ ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.