Karnataka Exit Poll 2023 Live: ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఇవే!
Karnataka Election Exit Poll Result 2023 Live. కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు పలు సంస్థలు వెల్లడించే `ఎగ్జిట్ పోల్స్` అంచనాలపై అందరూ ఆసక్తి కనబర్చుతున్నారు.
Karnataka Election Exit Poll Result 2023 Live Udpates and News: కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. అయితే పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పలు బూత్‌లలో ఓటర్లు క్యూ లైన్‌లలో ఉన్నారు. దాంతో క్యూ లైన్‌లలో ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం ఇచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 65.69 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు తెలిపారు.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. మే 13న ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు చేపట్టనున్నారు. ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు పలు సంస్థలు వెల్లడించే 'ఎగ్జిట్ పోల్స్' అంచనాలపై అందరూ ఆసక్తి కనబర్చుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో గెలుపెవరిదని అందరూ ఆసక్తిగా చుస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఓటర్లపై సర్వే చేసిన ఎగ్జిట్‌పోల్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్:
బీజేపీ 79 -94 సీట్లు
కాంగ్రెస్ 103 -118 సీట్లు
జేడీఎస్ 25 - 33 సీట్లు
ఇతరులు 2 - 5 సీట్లు
టీవీ9 భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్స్:
బీజేపీ 88 - 98 సీట్లు
కాంగ్రెస్ 99 - 109 సీట్లు
జేడీఎస్ 21 - 26 సీట్లు
ఇతరులు 0 - 4 సీట్లు
రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్:
బీజేపీ 85 -100 సీట్లు;
కాంగ్రెస్ 99 - 109;
జేడీఎస్ 24 - 32;
ఇతరులు 2 - 6
న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్స్:
బీజేపీ 114 +
కాంగ్రెస్ 86 +
జేడీఎస్ 21 +
ఇతరులు 3 +
సువర్ణ న్యూస్ ఎగ్జిట్ పోల్స్:
బీజేపీ 94 - 117
కాంగ్రెస్ 91 - 106
జేడీఎస్ 14 - 24
ఇతరులు 0 - 2
జన్‌కీ బాత్ ఎగ్జిట్‌పోల్:
బీజేపీ 94 - 117
కాంగ్రెస్ 91 - 106
జేడీఎస్ 14 - 24
మ్యాటరేజ్ ఎగ్జిట్‌పోల్:
బీజేపీ 79 - 99
కాంగ్రెస్ 103 - 118
జేడీఎస్ 23 - 25
పోల్ స్టార్ట్ ఎగ్జిట్‌పోల్:
కాంగ్రెస్ 99 -109
బీజేపీ 88 - 98
జేడీఎస్ 4 - 26
Also Read: Rohit Sharma Captaincy: ఐదు టైటిళ్లు గెలిచినా.. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ మాత్రం కాదు!
Also Read: Shraddha Das Photos: ఢీ షో కోసం శ్రద్దా దాస్ హాట్ ట్రీట్.. ఎద అందాల ఎర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.