Karnataka Assembly Elections 2023: కర్ణాటక ఎన్నికలపై దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు ఫోకస్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు మరో ఏడాదిలో జరుగుతుండడంతో కర్ణాటక ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఇక్కడ విజయం సాధించి.. మరోసారి అధికారం మాదే అని సంకేతాలు పంపించాలని బీజేపీ చూస్తుండగా.. బీజేపీకి చెక్ పెట్టి రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. విజయమే లక్ష్యంగా రెండు పార్టీల అగ్ర నాయకత్వం మొత్తం కర్ణాటక ఎన్నికల ప్రచారం రంగంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించాలంటూ కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ కృష్ణమ్ డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకంలేని కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఎప్పటి నుంచో ప్రియాంక గాంధీకి పార్టీ అధ్యక్షురాలి బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. ప్రియాంకకు బహిరంగంగా మద్దతు తెలుపుతున్న నేతల్లో ప్రమోద్ కృష్ణమ్ ఒకరు. ఆమెకు బాధ్యతలు అప్పగిస్తే.. కాంగ్రెస్‌లో మళ్లీ కొత్త శకం మొదలవుతుందని.. కిందిస్థాయి కేడర్‌లో పునరుత్తేజం వస్తుందని అంటున్నారు. 
 
సోనియా గాంధీ రాజకీయాలకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అనర్హడయ్యారు. ప్రస్తుతం ఈ విషయంపై రాహుల్ గాంధీ హైకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు కోర్టుల నుంచి ఉపశమనం లభించకపోతే.. ప్రియాంక గాంధీ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ స్థానంలో ప్రియంక గాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. 


2019లో ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి  ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పదవి బాధ్యతలు స్వీకరించారు. గత లోక్‌సభ ఎన్నికలకు బాధ్యతవహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సమయంలోనే ప్రియాంక గాంధీ పేరు తెరపైకి వచ్చింది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ సోనియా గాంధీనే బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత మల్లికార్జున్ ఖర్గేకు బాధ్యతలు అప్పగించారు. 


Also Read: Assembly Elections: కర్ణాటక నెక్ట్స్‌ ముఖ్యమంత్రిపై కాలభైరవ జోస్యం.. ఆయన పంట మళ్లీ పండినట్లేనా..?


ప్రస్తుతం రాహుల్ గాంధీ చిక్కుల్లో ఉండడంతో కాంగ్రెస్ వ్యూహరచనలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో కూడా బీజేపీదే అధికారమని ఇటీవల సర్వేలు చెబుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ప్రియాంక గాంధీ పేరు తెరపైకి వస్తే.. మళ్లీ ప్రజలు గందరగోళానికి గురవుతారని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సూపర్ సక్సెస్ కావడంతో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ 2024 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు ఓటమి ఎదురైతే.. ప్రియాంక గాంధీ పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.


Also Read: Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో నిమ్మకాయలు.. నన్ను బలిస్తారేమో అనుకున్నా: బండి సంజయ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook