Karnataka Next CM: కర్టాటక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులు ప్రచారరంగంలో దూసుకుపోతున్నారు. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు ఎవరు గెలుస్తారు..? ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా జ్యోతిష్యాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఫలనా అభ్యర్థి గ్రహ బలం చాలా బాగుందని.. కచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తారని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారు. ఆయా పార్టీల నాయకులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా గ్రౌండ్‌లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. తాము అధికారంలో వస్తే.. అన్ని వసతులు కల్పిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు అడుగుతుండగా.. మరోసారి తమనే గెలిపించాలని అధికార పక్షం కోరుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క‌ర్ణాట‌క‌కు కాబోయే మఖ్యమంత్రి ఎవరనే విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మండ్యాలోని అశోక్‌నగర్‌లో కాలభైరవ తదుపరి ముఖ్యమంత్రి ఎవరని అంచనా వేసింది. ఇక్కడను శునకాన్ని కాలభైరవుడిగా పూజిస్తారు. పూజలు నిర్వహించిన అనంతరం కాలభైరవుడి ముందు బసవరాజ బొమ్మై, హెచ్‌డీ కుమారస్వామి, డీకే శివకుమార్‌లు ఫోటోలను ఉంచారు. ఆ మూడు ఫొటోలలో కాబోయే ముఖ్యమంత్రిని ఎంచుకోవాలని శునకాన్ని అడిగారు. 


అది నేరుగా వెళ్లి హెచ్‌డీ కుమారస్వామి ఫొటోను ఎంచుకుంది. కుక్క యజమాని గోపి మాట్లాడుతూ.. కాలభైరవ చెప్పిన చాలా విషయాలు నిజాలు అయ్యాయని చెప్పారు. గతంలో కూడా ఇలానే అంచనా వేసిన విషయం జరిగాయని అన్నారు. మరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాలభైరవ జోస్యం నిజమవుతుందో లేదో చూడాలి. 


Also Read: User Charges Hike: సైలెంట్‌గా షాకిచ్చిన ప్రభుత్వం.. భారీగా ధరలు పెంపు  


కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మే 10న పోలింగ్ జరగనుండగా.. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించి.. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సౌత్‌లో బలమైన సంకేతాలు పంపించాలని చూస్తోంది. కర్ణాటకలో విజయం సాధిస్తే.. ఆ ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని అంచనా వేస్తోంది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసారి మ్యాజిక్ ఫిగర్ 112 సీట్ల కంటే ఎక్కువస్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు బీజేపీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఉన్నాయి. కర్ణాటక ప్రజల తీర్పు ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది.


Also Read: Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో నిమ్మకాయలు.. నన్ను బలిస్తారేమో అనుకున్నా: బండి సంజయ్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook