Karnataka Assembly Elections 2023: కర్ణాటక ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని అధికార బీజేపీ చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా సభలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని బేలూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కర్ణాటక ప్రాంతీయ పార్టీ జెడీఎస్‌కు కాంగ్రెస్ బి టీమ్ అంటూ సెటైర్ వేశారు. అదేవిధంగా తనను పాముతో పోల్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కౌంటర్ ఇచ్చారు. తనను పాముతో పోల్చడంపై అంగీకరిస్తున్నానని.. ఎందుకంటే ఈ పాము శివుని మెడలో ఉంటుందన్నారు. ఈ దేశ ప్రజలు భగవంతుని స్వరూపులని అని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని.. ఇది కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారిందన్నారు ప్రధాని మోదీ. అందుకే తనపై ఆగ్రహంతో ఉన్నారని.. తన సమాధికి గొయ్యి తీస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయడం కాంగ్రెస్‌కు సాధ్యం కాదని.. ఎందుకంటే వారు చేపట్టే ప్రతి ప్రాజెక్టులోనూ అవినీతి ఉందని దుయ్యబట్టారు. వేల కోట్లు మింగేసిన కుంభకోణంలో ఉన్నవారు.. అవినీతికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయగలరని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. మే 10న బీజేపీకి ఓటు వేసి సమాధానం ఇస్తారని అన్నారు. 


'కాంగ్రెస్ చేతిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు మోసపోయారు. మా ప్రభుత్వం వచ్చాక కోట్లాది ఇళ్లు ఇచ్చాం. 10 కోట్లకు పైగా ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించాం. 9 కోట్ల మంది మహిళలకు ఉచితంగా వంటగ్యాస్ ఇచ్చాం. 2.5 కోట్ల ఇళ్లకు నేరుగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశాం. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ తప్పుడు వాగ్దానాలు ఇస్తోంది. ప్రతి గ్రామానికి విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. కానీ ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తరువాత 18 వేల గ్రామాలకు కరెంటు ఇవ్వలేదు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత 1000 రోజుల్లో 18 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా చేశాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీని మా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చింది.  


2004లో ఎన్నికల్లో దేశంలోని రైతులకు ప్రత్యక్ష ఆదాయ మద్దతు పథకాన్ని ఇస్తానని చెప్పారు. 2009లో కూడా అదే హామీ ఇచ్చారు. కానీ రైతుల కోసం ఏ పథకాన్ని అమలు చేయలేదు. 2014లో మేము కిసాన్ సమ్మాన్ యోజనను అమలు చేశాం. నేరుగా రైతు ఖాతాలో డబ్బులు జమ చేశాం. ఇప్పటివరకు 2.5 లక్షల కోట్లు డిపాజిట్ చేశాం. ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తే.. బీజేపీ వారికి సాయం చేస్తోంది.


కాంగ్రెస్, దాని బీ టీమ్ కూడా పగటి కలలు కంటున్నాయి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్, నూరాకుష్టి, పార్లమెంట్‌లో కూడా కాంగ్రెస్, జేడీఎస్ కలిసే ఉన్నాయి. జేడీఎస్‌కు వేసే ప్రతి ఓటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళుతుంది. కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే అభివృద్ధికి బ్రేకులు వేయడమే.. కర్ణాటకలోని కాంగ్రెస్ బృందం ఢిల్లీలో ఉన్న కుటుంబానికి సేవ చేయాలి. సీఎం, అభ్యర్థిని నిర్ణయించాలన్నా.. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ కుటుంబ సభ్యులనే అడగాలి. కాంగ్రెస్ కుటుంబానికి తలవంచింతేనే ఆ పార్టీలో ఉంటాడు. జేడీఎస్ ఒక కుటుంబ పార్టీ. ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ..' అంటూ ప్రధాని సెటైర్లు వేశారు. 


దశాబ్దాల నాటి సంకీర్ణ రాజకీయాలకు స్వస్తి పలకాలని కర్ణాటక ప్రజలు నిర్ణయించారని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌లో అస్థిరత నెలకొందన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనతో అక్కడి ప్రజలు పాలనతో విసిగిపోయారని అన్నారు. ఆ రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, జేడీఎస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని.. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇద్దరూ ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకున్నారని గుర్తుచేశారు. జేడీఎస్ పార్టీలోని పెద్దలు తమ కుటుంబ సభ్యులను సెటిల్ చేసేందుకు కష్టపడుతున్నారని విమర్శించారు. 


Also Read: Rohit Sharma Birthday: రోహిత్ శర్మ బర్త్‌ డేకు హైదరాబాద్ ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్.. 60 అడుగుల భారీ కటౌట్.. కోహ్లీని మించి..!  


Also Read: New Secretariat In Telangana: కొత్త సచివాలయం గుండెకాయ వంటిది.. చెమట చిందించిన ప్రతి శ్రామికుడికీ ధన్యవాదాలు: సీఎం కేసీఆర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook