Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికల జోరు.. తొలిసారి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం
Vote From Home In Karnataka Elections: పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేని వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల కమిషన్ గుడ్‌న్యూస్ చెప్పింది. తొలిసారి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించనుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు చేయనుంది.
Vote From Home In Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రలను ప్రయోగిస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తూ.. ప్రజలకు ప్రసన్నం చేసుకుంటున్నారు. టికెట్ దక్కని అసంతృప్తులు పార్టీలు మారుతూ ఇతర పార్టీల్లో టికెట్లు దక్కించుకుంటున్నారు. మరోసారి అధికారం ఛేజిక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉండగా.. గతంలో కంటే ఎక్కువ సీట్లతో సీఎం పీఠం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. కర్ణాటకలోని మొత్తం 224 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 10న ఓటింగ్ జరగనుండగా.. 13న తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.
కర్ణాటక ఎన్నికల్లో తొలిసారి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది ఈసీ. రాష్ట్రవ్యాప్తంగా 80 ఏళ్లు పైబడిన 60 వేల మంది వృద్ధులు, 20 వేల మంది వరకు ప్రత్యేక వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేసేందుకు నమోదు చేసుకున్నారు. బెంగుళూరు సిటీలోనే బెంగళూరులో 8,500 మందికి పైగా సీనియర్ సిటిజన్లు, వందమందికి పైగా దివ్యాంగులుఇంటి నుంచి ఓటు వేయనున్నాఉ. ఇంటి నుంచి ఓటు వేసే సౌకర్యం మొదటిసారి కావడంతో ఓటర్ల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు. ఐదు శాతానిపైగా ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని వినియోగించుకోనున్నారు.
తుది ఓటర్ల జాబితాపై ఇంకా కసరత్తు చేస్తున్నట్లు కర్ణాటక చీఫ్ ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా తెలిపారు. దరఖాస్తులను పరిశీలించిన తరువాత ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని కల్పించాలని రిటర్నింగ్ అధికారి నిర్ణయిస్తారని తెలిపారు. ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు ముందుగానే అందజేస్తామన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి కర్ణాటక ఓటర్ల జాబితాలో 80 నుంచి 99 సంవత్సరాల వయస్సు గల 12.2 లక్షల మంది వృద్ధులు, 5.6 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు.
Also Read: ATM Withdrawal Rules: ఈ బ్యాంక్ కస్టమర్లకు షాక్.. నగదు విత్‌డ్రాలో రూల్స్ మార్పు
వందేళ్లకు పైబడిన ఓటర్లు 16 వేల మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలింగ్ కేంద్రానికి రాలేని వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: Hyderabad Boy Murder: నరబలి కలకలం.. బాలుడు దారుణ హత్య.. ఎముకలు విరిచి, బకెట్‌లో కుక్కి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook