Karnataka Bible Controversy: కర్ణాటకలోని విద్యాసంస్థలో హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన క్రమంలో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో హిజాబ్ ధరించిన చాలా మంది విద్యార్థినిలను పాఠశాలలతో పాటు పరీక్షలకూ అనుమతించలేదు. ఆ తర్వాత కోర్టు జోక్యంతో ఈ వివాదం ప్రస్తుతం సద్దుమణిగినా.. ఇప్పుడు మరో వివాదం కర్ణాటకలో రాచుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


కర్ణాటకలోని బెంగళూరు క్లారెన్స్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పాఠశాల యాజమాన్యం మతపరమైన అఫిడవిట్ తీసుకుంది. స్కూల్ కు క్రిస్టియన్ బైబిల్ తీసుకురావడాన్ని తాము వ్యతిరేకించబోమన్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల హామీ ఇస్తేనే వారిని చేర్చుకుంటున్నారు. ఇది కర్ణాటక విద్యా చట్టాన్ని ఉల్లంఘిస్తోందని రైట్ వింగ్ గ్రూపులు ఆరోపిస్తున్నాయి. 


క్లారెన్స్ ఉన్నత పాఠశాలలో 11వ తరగతి అడ్మిషన్ ఫారమ్ లో.. "విద్యార్థులు తమ పిల్లల ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఉదయం ప్రార్థనతో పాటు క్రైస్తవ మతానికి సంబంధించిన తరగతులను హాజరవుతారు. దానికి మేము వ్యతిరేకం కాదు" అని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సంతకాలను సేకరిస్తోంది పాఠశాల యాజమానం. అలా చేస్తేనే తమ పిల్లలకు అడ్మిషన్స్ ఇస్తామని వారు స్పష్టం చేశారు.


దీంతో ఇప్పుడు బైబిల్ పై వివాదానికి తెరలేపినట్లైంది. ఈ క్రమంలో పాఠశాలలో క్రైస్తవేతర విద్యార్థులను బైబిల్ చదవమని బలవంతం చేస్తున్నారని హిందూ జనజాగృతి సమితి (HJS) రాష్ట్ర అధికాక ప్రతినిధి మోహన్ గౌడ నిరసన తెలియజేశారు. 


ALso Read: Jarkhand Power Crisis: జార్ఖండ్‌లో విద్యుత్ సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధోని భార్య సాక్షి


Also Read: adipurush: ఆదిపురుష్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.