కర్ణాటక ఉప ఎన్నికలలో బీజేపీ గెలిచిన ఏకైక స్థానం శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం కావడం గమనార్హం. శివమొగ్గ ఎంపీగా ఉన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారన్న విషయం తెలిసిందే. కనుక.. ఆ ప్రాంతంలో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బరిలోకి దిగడం గమనార్హం. రాఘవేంద్రకు,  జేడీఎస్‌ నేత, మాజీ సీఎం ఎస్‌. బంగారప్ప  కుమారుడు మధు బంగారప్పకు మధ్య గట్టి పోటీ నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ మధు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా.. ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో రాఘవేంద్ర 50 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం. కానీ అంతిమంగా చూసుకుంటే.. ఈ కర్ణాటక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి అంతిమ విజేతగా నిలిచింది.  కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి నాలుగు చోట్ల విజయం సాధించింది. మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్‌ నేత శివరామగౌడ  సమీప బీజేపీ నేత సిద్ధరామయ్య పై విజయం సాధించగా.. రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ నేత, కర్ణాటక సీఎం కుమారస్వామి సతీమణి అనిత కుమారస్వామి గెలుపొందారు.


అలాగే జమఖండీలో కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సిద్ధు  న్యామగౌడ కుమారుడు ఆనంద్‌ విజయం సాధించారు. అలాగే బళ్లారిలో భాజపా అభ్యర్థి శాంతపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు 2లక్షల ఓట్ల  మెజార్టీతో ఆయన విజయం సాధించడం గమనార్హం.