Lockdown Rules Break: కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కఠినమైన లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ అమల్లో ఉంది. కర్నాటకలో సైతం కఠినమైన లాక్‌డౌన్ అమల్లో ఉంది. కంచే చేను మేసినట్టు..సాక్షాత్తూ ముఖ్యమంత్రి కుమారుడే లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన ఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా కరోనా సెకండా్ వేవ్(Corona Second Wave) ధాటి నుంచి తప్పించుకునేందుకు అత్యధిక రాష్ట్రాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. కర్నాటకలో పరిస్థితి విషమంగా ఉండటంతో కఠినమైన లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప(Yediyurappa) స్వయంగా ఆదేశించిన పరిస్థితి. అయినా సరే సాక్షాత్తూ ఆయన కుమారుడే లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు, బీజేపీ కర్నాటక ఉపాధ్యక్షుడైన బీవై విజయేంద్ర భార్యతో కలిసి మైసూరు జిల్లా నంజనగూడులోని కంఠేశ్వర స్వామి ఆలయాన్ని నిన్న ఉదయం 8 గంటలకు దర్శించారు.ఈ సందర్భంగా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటైంది. వీఐపీ ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడిదే రాష్ట్రవ్యాప్తంగా వివాదానికి దారి తీస్తోంది. ఎందుకంటే లాక్‌డౌన్(Lockdown) సందర్భంగా రాష్ట్రంలో ఆలయాలన్నీ మూసివేశారు. 


ముఖ్యమంత్రి కుమారుడికి నిబంధనలు వర్తించవా అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. కరోనా సంక్రమణ నేపధ్యంలో లాక్‌డౌన్ నిబంధనల్ని(Lockdown Rules Break) అతిక్రమించిన విజయేంద్రపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ విన్పిస్తోంది. ఓ వైపు నిబంధనలు అతిక్రమించడమే కాకుండా మరోవైపు పోలీసులు వీఐపీ మర్యాదలు, బందోబస్తు చేయడం ఎంతవరకూ సమంజసమనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. 


Also read: Covid19 Attack: కరోనా రక్కసికి మరో మంత్రి బలి, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook