Karnataka: కర్ణాటకలో ఆర్టీసీ, బీఎంటీసీ సిబ్బంది సమ్మె బాట పడుతున్నారు. కార్మికుల డిమాండ్లపై చర్చిస్తూనే సమ్మెకు దిగితే తీసుకోవల్సిన చర్యలపై కూడా అదికారులతో సమీక్షించారు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరవ వేతన కమీషన్ ( 6th  pay commission)ప్రకారం జీతాలు పెంచాలంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు (RTC Strike)పిలుపునిచ్చాయి. కర్ణాటక(Karnataka)లోని ఆర్టీసీ, బీఎంటీసీ సిబ్బంది ఏప్రిల్ 7న సమ్మె చేస్తున్నట్టు ప్రకటించాయి.  అయితే ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకు  కార్మిక సంఘాలతో చర్చిస్తూనే..సమ్మెకు దిగితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్టు సమాచారం. పట్టబట్టి సమ్మెకు దిగితే ఉద్యోగాల్నించి తొలగించాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప(Cm yeddyurappa) ఆదేశించారు. 


మరోవైపు ఐఏఎస్ అధికారి శరత్ వ్యవహారంలో క్యాట్ తీర్పుపై కూడా సమీక్షించారు. శరత్ బదిలీ విషయంలో ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకోవాలని క్యాట్ (CAT) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. 2020 సెప్టెంబర్ నెలలో  మైసూరు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శరత్‌ను రాష్ట్ర ప్రభుత్వం ( Karnataka government) నెలరోజుల వ్యవధిలోనే బదిలీ చేసింది. దాంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ తీర్పును రిజర్వులో ఉంచడంతో...ఆయన హైకోర్టు(High court)ను ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశాల మేరకు క్యాట్ తీర్పు వెలువరించింది.


Also read: West Bengal Elections 2021: బీజేపీకు ఓటేస్తే రాష్ట్ర మనుగడే ప్రశ్నార్ధకమంటున్న మమతా బెనర్జీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook