బ్రేక్‌ఫాస్ట్‌లో `చచ్చిన పాముపిల్ల`...56 మంది విద్యార్థులకు అస్వస్థత
Karnataka: బ్రేక్‌ఫాస్ట్ తిని..56 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
Karnataka: కర్ణాటకలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో దారుణం జరిగింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 56 మంది విద్యార్థులు(Students) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణం..బ్రేక్‌ఫాస్ట్‌లో చచ్చిన పాముపిల్ల(snakelet) ఉండటం.
వివరాల్లోకి వెళితే...
కర్ణాటకలోని యాదగిరి జిల్లా(Yadgir district) అబ్బేతుమ్కుర్(Abbetumkur village)లోని విశ్వారాధ్య విద్యావర్ధక రెసిడెన్షియల్ స్కూల్(Vishwaradhya Vidyavardhaka Residential School)లో విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్(breakfast)గా ఉప్మా(upma) పెట్టారు. వారికి పెట్టిన అల్పాహారంలో స్టూడెంట్స్ చచ్చిన పాముపిల్లను గుర్తించారు. వెంటనే యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కానీ అప్పటికే చాలా మంది ఆ ఆహారం తీసుకోవడం వల్ల అస్వస్థత(illness)కు గురయ్యారు.
Also Read: మహారాష్ట్రలో 14 ఏళ్ల గిరిజన బాలిక పై అత్యాచారం.. నిందితుడు అరెస్టు
విద్యార్థుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. విద్యార్థుల్ని స్థానిక ఎమ్మెల్యే వెంకటరెడ్డి, జిల్లా ఎస్పీ వెండమూర్తి పరామర్శించారు. పిల్లల ఆరోగ్య స్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులంతా ఎనిమిది, తొమ్మిది తరగతులకు చెందినవారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook