Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం ఎందరినో కలచివేసింది. ఆయన పనుల ద్వారా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తాజాగా ఆయనపై ఆ రాష్ట్ర అటవీ అధికారులు(Forest officials) అభిమానాన్ని చాటుకున్నారు. శివమెుగ్గ(Shivamogga)లోని సక్రెబైలు(Sakrebailu) ఏనుగు శిబిరంలో రెండేళ్ల వయసున్న గున్న ఏనుగుకు పునీత్ (Puneeth Rajkuma) పేరు పెట్టి తమదైన శైలిలో నివాళులర్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Shiva Rajkumar: 'మీకు నేను ఉన్నా అన్న'’ Jr NTR..మీడియాతో పంచుకున్న శివరాజ్ కుమార్


పునీత(Puneeth Raj Kumar) తన మరణానికి ముందు ఏనుగు శిబిరాన్ని సందర్శించినట్లు అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటివ్ అధికారి నాగరాజు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ డాక్యుమెంటరీ షూటింగ్‌లో భాగంగా.. సుమారు రెండు గంటలకుపైగా ఈ గున్న ఏనుగు(Elephant)తో పునీత్ సరదాగా గడిపినట్లు చెప్పారు. ఈ శిబిరాన్ని పునీత్ చివరిసారిగా సెప్టెంబర్‌లో సందర్శించారు. అయితే ఆయన ఆకస్మిక మరణంతో తీవ్ర దిగ్బ్రాంతి చెందిన ఆటవీ సిబ్బంది ఈ గున్న ఏనుగుకు పునీత్ పేరు పెట్టాలని కోరినట్లు చెప్పారు. ఈ మేరకు గజరాజుకు పునీత్ పేరు పెట్టినట్లు తెలిపారు. సాధారణంగా ఇక్కడ ఏనుగుల పిల్లలకు దేవతల పేర్లు పెడతాం. కానీ పునీత్ పేరు పెట్టడం తమకు సంతోషాన్ని కలిగిస్తోందని నాగరాజ్ అన్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook