EX CM Kumaraswamy On Farmers: ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కర్ణాటకలో నేతలు ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు అనేక హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులను ఆకట్టుకునేందుకు జేడీ(ఎస్‌) అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఓ విచిత్ర హామీ ఇచ్చారు. తమ కుమారులను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు చెప్పిన నేపథ్యంలో ఆయన ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. రైతుల కుమారులను పెళ్లి చేసుకునే యువతులకు రూ.2 లక్షల నగదు ఇస్తామని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోలార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కుమారస్వామి మాట్లాడుతూ.. రైతు బిడ్డలతో పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు యువతులకు ప్రభుత్వం తరుపున 2 లక్షల రూపాయల నజరానా అందజేస్తామన్నారు. రైతుల పిల్లలకు ఆడబిడ్డలు ఇవ్వడం లేదని జిల్లా యువత ఆయనకు వినతి పత్రం అందజేయగా..  రైతు బిడ్డలను ప్రోత్సహించేందుకు జేడీఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు బిడ్డల పెళ్లిళ్లకు 2 లక్షల రూపాయలు ఇస్తామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని శ్రీశక్తి సంఘాల రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. 


'కోలార్ జిల్లా ప్రజలకు మంచినీరు అందించేవరకు మా పోరాడుతాం. కోలారు ప్రజలకు అంచలంచెలుగా విషపు నీరు అందిస్తున్నారు. ఎత్తిపోతల నుంచి జిల్లాకు నీళ్లు తెస్తానని కొందరు జేబులు నింపుకున్నారు. పైకి సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారు. కానీ జిల్లాకు మాత్రం నీరు రావడం లేదు కానీ.. వాళ్లు జేబులు మాత్రం నిండుగా ఉన్నాయి. కోలార్‌ జిల్లాలో జేడీఎస్‌ ఆరు స్థానాల్లో గెలిపించండి. నేను అధికారంలోకి వస్తే ఐదేళ్లలో కోలారు జిల్లాకు మంచినీరు అందిస్తా..' అని కుమారస్వామి ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లను రద్దు చేసిందని.. తాము అధికారంలోకి వస్తే మళ్లీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. 


Also Read: Today Match in IPL 2023: ముంబైతో ఢిల్లీ పోరు.. తొలి గెలుపు ఎవరిదో.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం


కర్ణాటకలో 224 నియోజకవర్గాలు ఉండగా.. ఏప్రిల్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 20 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 21 న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మే 10న పోలింగ్ నిర్వహించి.. మే 13న ఓట్ల ఫలితాలను వెల్లడించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2018లో జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లోని కొందరు ఎమ్మెల్యేలను బీజేపీ తమ వైపునకు తిప్పుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 


Also Read: Salman Khan New Car: సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు.. పవర్‌ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి