Farmer lodges complaint over cows not gives milk: ఇటీవలి కాలంలో పోలీసులకు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. ఉన్న కేసులతోనే సతమతమవుతుంటే... పిల్లి పారిపోయిందనో, గేదె మేత మేయట్లేదనో.. ఇలా కొన్ని సిల్లీ కేసులు ఎదురవుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని (Karnataka) హోలెహొన్నూర్ పోలీసులకు ఇలాంటిదే ఓ వింత కేసు ఎదురైంది. తన ఆవులు (Cows) పాలివ్వట్లేదని ఓ రైతు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భద్రావతి తాలుకాలోని సిద్లిపురాకు చెందిన రామయ్య అనే రైతు (Farmer) ఇటీవల హోలెహొన్నూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. 'నేను నా 4 ఆవులను ప్రతీ రోజూ ఉదయం 8గంటల నుంచి 11గంటల వరకు, తిరిగి సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు మేతకు తీసుకెళ్తాను. ఏమైందో తెలియదు కానీ గత నాలుగు రోజులుగా ఆవులు పాలివ్వడం లేదు. పాలు పితకడానికి వెళ్తే కాలితో తంతున్నాయి. మీరే ఎలాగైనా ఆవులు పాలిచ్చేలా చేయాలి.' అని రామయ్య పోలీసులకు (Karnataka Police) విజ్ఞప్తి చేశాడు.


రామయ్య చెప్పింది విన్నాక పోలీసులకు ఏం చెప్పాలో తెలియలేదు. ఇలాంటి ఫిర్యాదులను తాము స్వీకరించలేమని సున్నితంగా అతనికి నచ్చజెప్పారు. దీంతో రామయ్య విచారంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇటీవలే మధ్యప్రదేశ్‌లోనూ (Madhya Pradesh) ఇలాంటి ఘటన చోటు చోసుకున్న సంగతి తెలిసిందే. తన గేదెలకు ఎవరో చేతబడి చేశారని... అప్పటినుంచి అవి పాలివ్వట్లేదని ఓ మధ్యప్రదేశ్ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏకంగా ఆ గేదెలను వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే, దానికి తామేమీ చేయలేమని... పశు వైద్యుల వద్దకు వెళ్తే ఫలితం ఉంటుందని పోలీసులు ఆ రైతుకు చెప్పారు. దీంతో అక్కడి నుంచి పశు వైద్యుల వద్దకు వెళ్లాడు. ఆ మరుసటిరోజు నుంచి తన గేదెలు పాలివ్వడంతో సంతోషించాడు. ఇదే విషయాన్ని మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో చెప్పొచ్చాడు.


Also Read: Actor Shivaram: ప్రముఖ కన్నడ నటుడు శివరామ్ కన్నుమూత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి