బెంగళూరు: బెంగళూరులో దారుణం జరిగింది. కర్నాటక లోకాయుక్త జస్టిస్ విశ్వనాథ్ శెట్టిని గురువారం ఆయన ఆఫీసులోనే పొడిచాడు ఓ దుండగుడు. లోకాయుక్తకు ఫిర్యాదు ఇచ్చేందుకు ఓ వ్యక్తి వచ్చాడు. ఫిర్యాదు ఇచ్చే క్రమంలో వెంట తెచ్చుకున్న కత్తితో జస్టిస్ పై  దాడిచేశాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. తేరుకున్న సిబ్బంది వెంటనే అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. జస్టిస్ శెట్టిని హుటాహుటిన మాల్య ఆసుపత్రికి తరలించారు. ప్రమాదస్థితి నుంచి జస్టిస్ బయటపడ్డారని రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య జస్టిస్ శెట్టిని పరామర్శించారు.