Karnataka: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పదవి నుంచి దిగిపోయేందుకు రంగం సిద్ధమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటకలో(Karnataka)గత కొద్దిరోజులుగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక అధికార పీఠం కోసం పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రిగా యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఒత్తిడి తీవ్రమౌతోంది. ఇందులో భాగంగానే యడ్యూరప్ప 3 రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అటు యడ్యూరప్ప వ్యతిరేకులు సైతం ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అవుతూ పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ విన్నా యడ్యూరప్ప (Yediyurappa)ముఖ్యమంత్రి పదవి గురించే విన్పిస్తోంది. క్రమంగా యడ్యూరప్పపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఇక యడ్యూరప్ప కూడా ముఖ్యమంత్రి పీఠం వదిలేందుకు సిద్ధమైనట్టు సమాచారం.


ముఖ్యమంత్రి పదవి వదిలేలోగా సొంత నియోజకవర్గం శివమొగ్గలో పెద్దఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా శివమొగ్గలో ముఖ్యమంత్రి హోదాలో ఈ నెల 23, 24 తేదీల్లో పర్యటన చేయనున్నారు. బీజేపీ(BJP)ఎమ్మెల్యేలు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో చివరిసారిగా సమావేశమై..ఈ నెల 25వ తేదీన విందు ఏర్పాటు చేయాలనేది యడ్యూరప్ప ఆలోచనగా ఉంది. అందరికీ గుర్తుండేలా ఈ విందు ఉండవచ్చని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా చివరి రోజుల్లో తన మార్క్ చూపించాలని యడ్యూరప్ప నిర్ణయించుకున్నారు. జూలై 26వ తేదీన యడ్యూరప్ప రాజీనామా చేయవచ్చేనే ప్రచారం జోరుగా సాగుతోంది.


Also read: Rajyasabha: రాజ్యసభ ఉప నాయకుడిగా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి నియామకం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook