Karnataka Politics: కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఇదే పంచాయితీ ఉంటుంటుంది. పాలించమని అధికారం అప్పగించినా ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చుకోలేకపోతోంది. అటు అధిష్టానం కూడా కర్ణాటక పంచాయితీ తేల్చలేక త పట్టుకుంటోంది. నిన్నంతా బెంగళూరులోని షాంగ్రిలా హోటల్‌లో చాలా తతంగమే జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

224 సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో 136 స్థానాలు గెల్చుకుని మూడ్రోజులవుతున్నా ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ పార్టీ తేల్చుకోలేకపోతోంది. సిద్ద రామయ్య వర్సెస్ డీకే శివకుమార్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి మరి అంటున్నారు కన్నడ ప్రజలు. అంతే మరి. పాలించమని పగ్గాలు చేతికిస్తే ఆ పార్టీ సీఎం అభ్యర్ధి ఎవరనేది తేల్చుకోలేకపోతోంది. ఇది తేల్చేందుకు ప్రత్యేక ఏఐసీసీ బృందం బెంగళూరులో ఎమ్మెల్యేలతో ఒక్కొక్కరిగా సమావేశమై అభిప్రాయాలు సేకరిస్తోంది. అవసరమైతే బుజ్జుగించే చర్యలు చేపట్టింది. అయినా కొలిక్కి రాలేదు. 


నిన్న సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా పుట్టినరోజు కారణంతో డీకే వెళ్లలేదు. సిద్ధ రామయ్య ఒక్కరే వెళ్లారు. దాంతో ఇవాళ రావల్సిందిగా ఢిల్లీ అధిష్టానం పిలుపిచ్చింది. ఇవాళ డీకే ఢిల్లీకు పయనం కావచ్చని సమాచారం.


ప్రతిపాదన సిద్ధం


తొలి రెండేళ్లు సిద్ధ రామయ్యకు ముఖ్యమంత్రి పదవిచ్చి ఆ తరవాత మూడేళ్లు డీకే శివకుమార్ కు ఇవ్వాలి. ఇది సిద్ధ రామయ్య స్వయంగా చేసిన ప్రతిపాదన. దీనికి డీకే నుంచి పెద్దగా అభ్యంతరం లేదు గానీ ఈ తొలి రెండేళ్లలో డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేల్లో మెజార్టీ సిద్ధ రామయ్యనే ముఖ్యమంత్రి చేయాలని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. డీకేపై చాలా కేసులు పెండింగులో ఉండటం వల్ల అధిష్టానం సిద్ధరామయ్య వైపుకు మొగ్గు చూపుతోంది. తొలి రెండేళ్లు ఆ కేసుల నుంచి బయటపడితే ఆ తరువాత ముఖ్యమంత్రి పగ్గాలు అందించినా పెద్ద సమస్య ఉండకపోవచ్చని అధిష్టానం భావిస్తోంది.


ఇవాళ డీకే శివకుమార్ ఢిల్లీకు వెళ్లనున్నారు. ఇప్పటికే సిద్ధ రామయ్య ప్రతిపాదన అధిష్టానం దగ్గరుంది. ఇక డీకే శివకుమార్‌తో చర్చల అనంతరం అంటే మరో రెండ్రోజుల్లో సీఎం అభ్యర్ధిపై అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేయవచ్చు.మరోవైపు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాల్ని బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. ఏదైనా అటూ ఇటైతే ఏమైనా జరగవచ్చనేది గత అనుభవాలు చెబుతున్నాయి.


Also read: Telangana Temperature: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook