ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కి వచ్చిన నవ వధువును చూసి జనాలు ఆశ్చర్యపోయారు. పట్టు పరికిణీ ధరించి వచ్చిన ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పలువురు దివ్యాంగులు కూడా కష్టపడి పోలింగ్ బూత్ వద్దకు వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక ఎన్నికల సందర్భంగా హంపీ నగర్ ప్రాంతంలో పోలింగ్ బూత్‌ల వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం దూషణలు చేసుకుంటూ.. ఆ తర్వాత ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నారు



కాంగ్రెస్ దాదాపు 120 సీట్లు గెలుచుకుంటుందని సిద్ధరామయ్య జోస్యం చెప్పారు



సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే బసవనగరు ప్రాంతంతో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు



పండిట్ రవిశంకర్ కనకపూర పోలింగ్ స్టేషనులో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు



మైసూరు రాజవంశానికి చెందిన క్రిష్ణదత్తా చామరాజ వడియార్ మైసూరులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు



భారత టెస్టు జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన ఓటు హక్కు వినియెగించుకున్నారు



భారత మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ తన కుటుంబంతో సహా వచ్చి ఓటు వేశారు



బీజేపీ నేత సదానంద గౌడ పుత్తూరులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు



బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ ఎడ్యూరప్ప షికర్ పూర్ ప్రాంతంలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు