ఎయిర్ సెల్, మాక్సిస్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి ఎట్టకేలకు యాంట్సిపేటరీ బెయిల్ మంజూరు అయ్యింది.  ఈ కేసులో తదుపరి హియరింగ్ తేదిగా 16 ఏప్రిల్‌ను న్యాయమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో కూడా కార్తికి బెయిల్ మంజూరు అయ్యింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఫిబ్రవరి 28వ తేదిన  విచారణ నిమిత్తం సిబిఐ కోర్టు ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆయనకు 12 రోజులు జ్యుడిషియల్ కస్టడీని కూడా విధించారు. ఆ కస్టడీ గడువు కాలం ముగియడంతో ఆయనకు ఢిల్లీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే రూ.10 లక్షలు పూచీకత్తు ఇవ్వాలని తెలిపింది.


అలాగే పలు షరతులు కూడా విధిస్తూ.. ఆయనకు జస్టిస్ గార్గ్ బెయిల్ మంజూరు చేశారు. ఇప్పటికే కార్తి చిదంబరానికి చెందిన పాస్ పోర్టును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సీనియర్ న్యాయవాదులైన కపిల్ సిబాల్‌తో పాటు సుబ్రహ్మణ్యం, సల్మాన్ ఖుర్షిద్, మోహిత్ మాథుర్ ఈ కేసులో కార్తి చిదంబరానికి న్యాయ సలహాలు ఇస్తున్నారు. కార్తి చిదంబారానికి సంబంధించిన బెయిల్ పిటీషను హియరింగ్‌కు వస్తున్న సమయంలో ఆయన తండ్రి పి.చిదంబరంతో పాటు తల్లి నళినీ చిదంబరం కూడా నల్లటి గౌన్స్ ధరించి కోర్టులోకి వచ్చారు.